AP High Court: జగన్ ప్రభుత్వానికి ఊరట.. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రూట్ క్లియర్!

పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

AP High Court: జగన్ ప్రభుత్వానికి ఊరట.. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రూట్ క్లియర్!

High Court Of Andhra Pradesh Key Comments On Amaravati

AP High Court: పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. రిట్‌ పిటిషన్లను కూడా ఉపసంహరించుకున్నారు పిటిషనర్లు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయవచ్చని స్పష్టం చేయడంతో ఇళ్లపట్టాల పంపిణీకి మార్గం సుగమం అయింది.

రాష్ట్రవ్యాప్తంగా 3.60 లక్షల మందికి జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇవ్వాలని నిర్ణయించగా.. అందులో ఇంటి నిర్మాణాన్ని కూడా చేపట్టాలని భావించింది. ఇందుకోసం రాష్ట్రంలో భూసేకరణ చేసింది ప్రభుత్వం. ఇంకా అర్హులు ఎవరైనా మిగిలిపోతే వారు దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లోగా ఇళ్లపట్టాలు మంజూరుచేస్తామని కూడా హైకోర్టుకు వెల్లడించింది ప్రభుత్వం.

హైకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన 128 పిటీషన్లను ఉపసంహరించుకున్నట్లుగా అయ్యింది. ఈ సంధర్భంగా ప్రధాని ఆవాస్‌ యోజన పథకం ఉద్దేశాలను సరిగ్గా అర్థంచేసుకోలేకపోయారని కోర్టుకు నివేదించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాదనలను అంగీకరించిన కోర్టు కేసులను ముగిస్తున్నట్టుగా స్పష్టం చేసింది.