AP Covid – ఏపీలో కరోనా కేసులు హాఫ్ సెంచరీ.. నాలుగు జిల్లాలో సున్నా కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,801 పాజిటివ్ కేసులకు గాను…23,03,438 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స...

AP Covid – ఏపీలో కరోనా కేసులు హాఫ్ సెంచరీ.. నాలుగు జిల్లాలో సున్నా కేసులు

Ap Covid

Andhra Pradesh Covid 19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వెళ్లిపోతోంది. భారీ సంఖ్యలో కేసులు తగ్గిపోతున్నాయి. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే వైరస్ నుంచి ప్రజలు బయటపడుతున్నారు. కరోనా విషయానికి వస్తే..24 గంటల వ్యవధిలో 50 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Read More : Telangana Covid : తెలంగాణలో కొత్తగా 91 కరోనా కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 23,18,801 పాజిటివ్ కేసులకు గాను…23,03,438 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,730 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 633గా ఉందని తెలిపింది. 12 వేల 789 శాంపిల్స్ పరీక్షించగా…50 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. గడిచిన 24 గంటల్లో 77 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,32,50,093 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

Read More : భారత్‌లో మరో కరోనా వ్యాక్సిన్

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 12. చిత్తూరు 08. ఈస్ట్ గోదావరి 06. గుంటూరు 07. వైఎస్ఆర్ కడప 02. కృష్ణా 02. కర్నూలు 00. నెల్లూరు 00. ప్రకాశం 01. శ్రీకాకుళం 00. విశాఖపట్టణం 09. విజయనగరం 00. వెస్ట్ గోదావరి 03. మొత్తం : 50