Andhra Pradesh: ఏపీకి రజనీకాంత్, కడప జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఏపీ రౌండప్

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సీనిఫక్కీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉంది అర్జెంట్‌గా బంగారు నగలు కావాలంటూ షాపులో హడావుడిచేసిన ఇద్దరు కిలాడీ లేడీలు చోరీకి పాల్పడ్డారు.

Andhra Pradesh: ఏపీకి రజనీకాంత్, కడప జిల్లాలో గవర్నర్ పర్యటన.. ఏపీ రౌండప్

AP Roundup

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. ఈకార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గోనున్నారు. అదేవిధంగా కడప జిల్లాలో ఏపీ గవర్నర్ పర్యటన కొనసాగుతోంది.. ఇలా ఏపీలోని ముఖ్యమైన వార్తల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

విజయవాడలో ఇవాళ సాయంత్రం జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అంకురార్పణ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గోనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నెలరోజుల పాటు 100ప్రాంతాల్లో 100 వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు నివాసానికి రజనీకాంత్, బాలకృష్ణ వెళ్తారు. అక్కడి నుంచి వారు ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గోనున్నారు. ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్. వెంకటనారాయణకూడా పాల్గోనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాల విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియచేసే లక్ష్యంతో టీడీ జనార్థన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం విధితమే.

తిరుమల సమాచారం ..

శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. గురువారం శ్రీవారిని 65,910 భక్తులు దర్శించుకున్నారు. గురువారంరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.80 కోట్లు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనం కోసం 11 కంపార్ట్మెంట్‌లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం ఉండనుంది.

కడప జిల్లాలో గవర్నర్ పర్యటన..

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయంకు చేరుకుంటారు. కడప ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3.40 గంటలకు ఒంటిమిట్ట తితిదే విశ్రాంతి భవనానికి చేరుకుంటారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సందర్శించి కోదండరాముడిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాకు( పెద్దదర్గా )చేరుకుని ప్రార్థనల్లో పాల్గొంటారు. అక్కడ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుని హెలీకాప్టర్‌లో రేణిగుంటకు బయలుదేరి వెళతారు.

కిడ్నీ రాకెట్ కేసు ..

కిడ్నీ రాకెట్ వ్యవహరం‌పై విచారణ కొనసాగుతోంది. పెందుర్తి తిరుమల ఆసుపత్రి కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఆసుపత్రికి అనుమతులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రి సీజ్ చేశారు. కిడ్నీ ఆపరేషన్లు చేసిన డాక్టర్లు ఎవరు, ఎంత మంది, ఎవ్వరెవరికి చేశారు అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసుల అదుపులో మధ్యవర్తి కామరాజు ఉన్నారు. భాదితుడు వినయ్ కుమార్‌కు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

శ్వేత మృతి కేసు ..

శ్వేత మృతి‌పై పోలీసుల ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. న్యూ పోర్టు పోలీసు ష్టేషన్ పరిధిలో పలు ఆలయాల సీసీ కెమెరాలతో పాటు, పలువురు ఆటో డ్రైవర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి శ్వేత పోస్టుమార్టం రిపోర్ట్ కీలకం కానుంది. బీచ్ రోడ్డు సీసీ కెమెరాలను ఇప్పటికే పోలీసులు పరిశీలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదులో భర్తతో పాటు అత్తమామ, ఆడపడుచు భర్త సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే శ్వేత అంత్యక్రియలు పూర్తయ్యాయి.

కిలాడీ లేడీల గుట్టురట్టు ..

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సీనిఫక్కీలో చోరీ జరిగింది. ఫంక్షన్ ఉంది అర్జెంట్‌గా బంగారు నగలు కావాలంటూ షాపు యజమానిని ఇద్దరు కిలాడీ లేడీలు హడావిడి చేశారు. ఈ క్రమంలో అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారు నగలు ఉంచి షాపు యజమానిని బూరిడీ కొట్టించారు. బంగారు నగలను దొంగిలించి ఉడాయించిన అనంతరం నకిలీ బంగారం చూసి షాక్‌కు గురైన షాపు యజమాని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు షాపు వద్దకు చేరుకొని సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ రికార్డుల్లో కిలాడీ లేడీలు చోరీ చేసినట్లు తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం..

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక ఆర్టీసి బస్సు ఐచర్ వాహనం ఢీకొనడంతో ఐచర్ డ్రైవర్ మృతి చెందాడు. కర్ణాటక ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం.. 

విశాఖ మహానగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో 32అంశాలతో ప్రధాన ఎజెండా రూపొందించారు. టేబుల్‌ ఎజెండాగా మరికొన్ని అంశాలు ఉన్నారు. జీ-20 పనుల్లో అక్రమాలు, నాణ్యతాలోపంపై విపక్షాలు పట్టు పడుతున్నాయి. మెకానికల్‌ విభాగంలో అవినీతిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది.