Andhra-pradesh : నారా లోకేశ్ మీటింగ్ లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు వల్లభనేని వంశీ..కొడాలి నాని

నారా లోకేశ్ నిర్వహించిన మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని,దేవేందర్ రెడ్డి, రమ్యశ్రీలు నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.

Andhra-pradesh : నారా లోకేశ్ మీటింగ్ లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు వల్లభనేని వంశీ..కొడాలి నాని

Ycp Leaders Kodali Nani And Vallabhaneni Vamsi Apperead On Nara Lokesh Zoom Meeting

Andhra-pradesh politics : నారా లోకేశ్ నిర్వహించిన మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని,దేవేందర్ రెడ్డి, రమ్యశ్రీ ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ వైసీపీ నేతలు లోకేశ్ మీటింగ్ కు ఎలా వచ్చారు?కొంపదీసి టీడీపీలో చేరుతున్నారా?అని ఆశ్చర్యపోతున్నారా? అదేం కాదు.అసలు ఏం జరిగిందంటే..ఏపీలో భారీ సంఖ్యలో 10th విద్యార్ధులు ఫెయిల్ అయినవిషయం తెలిసిందే. దీనిపై నారా లోకేశ్ ప్రభుత్వంపై పలు విమర్శలు సంధించారు. ఈ క్రమంలో లోకేశ్ 10th విద్యార్ధులతోలోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్ లోకి మాజీ మంత్రి కొడాలినాని. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యారు.

విద్యార్ధుల తల్లిదండ్రుల పేర్లతో వల్లభనేని వంశీ, కొడాలినాని,దేవేందర్ రెడ్డి రమ్మశ్రీలు లాగిన్ అయ్యారు. జూమ్ మీటింగ్ లో వారిని చూసిన నారా లోకేశ్ వారికి సవాల్ విసిరారు. దొంగ ఐడీలతో మీటింగ్ లోకి వచ్చి ఇబ్బంది పెట్టాలనే వైసీపీ నేతలు ఇలా చేస్తున్నారని..బెదిరించేలా మాట్లాడుతున్నారని కానీ వైసీపీ బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదన్నారు లోకేశ్. జూమ్ మీటింగ్ లోకి కాదు దమ్ముంటే నేరుగా రావాలి అంటూ లోకేశ్ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. చేతకాకి విద్యార్ధులను ఫెయిల్ చేసి వారి భవిష్యత్తును నాశనం చేశారు ప్రభుత్వం చేసిన నిర్వాకానికి విద్యార్ధుల భవిష్యత్తు నాశనం అవుతోంది అంటూ విమర్శలు సంధించారు.దమ్ముంటే ఎదురుగా రావాలని సవాల్ విసిరాదు.దీంతో వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్ నుంచి తప్పుకున్నారు.

తాను నిర్వహించే ఈ జూమ్ మీటింగ్ అన్యాయమైన విద్యార్ధుల కోసమనీ..కానీ ఎప్పుడు 10th క్లాస్ తప్పి..పద్ధతి తప్పిన వైసీపీ నేతల కోసం కాదు అంటూ చురకలు వేశారు నారా లోకేశ్. దీంతో వల్లభనేని వంశీ వెంటనే జూమ్ కాల్ నుంచి తప్పుకున్నారు. అలా టెన్త్ పరీక్షా ఫలితాలపై టీడీపీ,వైసీపీ రాజకీయం నడిచింది.

కాగా..ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్ధుల ఉత్తీర్ణత శాతంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పడిపోయిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నాయి. ఈ విషయమై టెన్త్ క్లాస్ విద్యార్ధులతో నారా లోకేష్ ఇవాళ Zoom APP ద్వారా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరశైలి విద్యార్ధులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయమై చెప్పారు.ఈ సమయంలోనే వైసీపి నేతలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రత్యక్షమై ఏదో విమర్శిందామనుకుంటే నారా లోకేశ్ వేసిన కౌంటర్లకు వైసీపీ నేతల ఢంగైపోయారు.