Somireddy Chandra Mohan Reddy : టీడీపీలోకి మరో నెల్లూరు వైసీపీ నేత? సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Somireddy Chandra Mohan Reddy : రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి..

Somireddy Chandra Mohan Reddy : టీడీపీలోకి మరో నెల్లూరు వైసీపీ నేత? సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Somireddy Chandra Mohan Reddy(Photo : Google)

Updated On : June 28, 2023 / 12:20 AM IST

Somireddy – Nellore YSRCP : నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి మరికొందరు నాయకులు టీడీపీలో చేరనున్నారా? ఓ ఎంపీ ఫ్యాన్ కట్టేసి సైకిల్ ఎక్కుతారా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీకి చెందిన ఓ ఎంపీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు టీడీపీ నేతల సమన్వయ కమిటీ సమావేశంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

” కొంతకాలం క్రితం నేను, ఆదాల ప్రభాకర రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక ఫంక్షన్ లో కలుసుకున్నాం. రాజకీయ పరిస్థితులపై చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి వచ్చేయమని పిలిచా. ఎన్నికల సమయంలో లాస్ట్ లో పార్టీ మారడం ఆదాలకు అలవాటు. నామినేషన్ వేయకముందో, వేసిన తర్వాతో ఆదాల నిర్ణయం తీసుకుంటారు.

Also Read..TDP Leaders : జగన్ ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు.. నెల్లూరు నుండే వైసీపీ పతనం ప్రారంభం : టీడీపీ నేతలు

అది నాకు తెలుసు. రామనారాయణ రెడ్డి అసంతృప్తిగా ఉండడంతో టీడీపీలోకి రమ్మని మొదట నేనే ఆహ్వానించా. రాజకీయాల్లో శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శత్రుత్వం ఉండదు. గతంలో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడం వల్లే నేను మూడుసార్లు మంత్రిని అవ్వగలిగాను” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

Also Read..Pawan Kalyan : తూర్పుకాపుల్లో బలమైన నాయకులున్నా.. వారు వెనుకబడే ఉన్నారు : పవన్ కల్యాణ్