AP Assembly : స్పీకర్ సీరియస్.. బజార్ కాదు.. శాసనసభ, మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్

టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

AP Assembly : స్పీకర్ సీరియస్.. బజార్ కాదు.. శాసనసభ, మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెండ్

Ap Assembly Speaker Tammineni Sitaram Suspends Five Tdp Mlas From Ap Assembly (1)

Suspension Of TDP MLAs Again : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏ మాత్రం మార్పు కనబడడం లేదు. అవే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. సభ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు లేవడం.. ఆందోళనలు చేయడం, నిరసనలు దిగడం పరిపాటై పోయింది. 2022, మార్చి 21వ తేదీ సోమవారం కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. సభలో పోడియం దగ్గరకు దూసుకొచ్చి పుస్తకాలతో కొట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Read More : AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!

ఇది బజార్ కాదు.. శాసనసభ, మీరు ఎమ్మెల్యేలు వీధి రౌడీలు కాదంటూ వ్యాఖ్యానించారు. ఇలా ప్రతిరోజు ప్రవర్తించడం సరికాదంటూ హితవు పలికారు. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని, సభలో ప్రతిపక్ష సభ్యులు హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని సూచించారు. రూల్స్ ఇవ్వడం.. ప్రతిరోజు నిరసనలకు దిగడం ఏ మాత్రం మంచిది కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి ముందుకు రావాలన్నారు స్పీకర్ తమ్మనేని.

Read More : Andharpradesh : ఏపీ అసెంబ్లీలో రచ్చ స్టార్ట్.. టీడీపీ ఆందోళనలు, నినాదాలు

అలాగే.. టీడీపీ సభ్యులు ఆందోళనలు చేస్తూ సభకు ఆటంకం కలిగిస్తుండడంతో వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. విలువైన సభా సమయాన్ని వృథా చేయొద్దని, సభా మర్యాదను కాపాడాలని తాను ఎన్నోమార్లు సూచించినా టీడీపీ సభ్యుల్లో మార్పు రావడం లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శాసనసభను నిర్వహించి వారి సమస్యలు పరిష్కరిస్తాం, కానీ మీరు చేస్తున్న వ్యవహారం ప్రజల చూసి సిగ్గు పడుతున్నారని వెల్లడించారు.