వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.16వేల కోట్లు, అమ్మఒడికి రూ.6వేల కోట్లు.. ఏపీ బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత కేటాయించారంటే

ఏపీ బ‌డ్జెట్ 2020-21ను ఆర్థికమంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మంగళవారం(జూన్ 16,2020) శాసనసభలో

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 08:49 AM IST
వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.16వేల కోట్లు, అమ్మఒడికి రూ.6వేల కోట్లు.. ఏపీ బడ్జెట్‌లో ఏ పథకానికి ఎంత కేటాయించారంటే

ఏపీ బ‌డ్జెట్ 2020-21ను ఆర్థికమంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మంగళవారం(జూన్ 16,2020) శాసనసభలో

ఏపీ బ‌డ్జెట్ 2020-21ను ఆర్థికమంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మంగళవారం(జూన్ 16,2020) శాసనసభలో ప్ర‌వేశ పెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను జగన్ ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో వరుసగా రెండోసారి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా, మండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారు.

ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని ముందుకు పోతున్నామ‌ని, ప్రాణాల‌కు తెగించి ప్ర‌జా సేవ‌లో పాల్గొంటున్న ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు మంత్రి బుగ్గన. ఏడాదిలోగా ఇచ్చిన హామీల్లో 90 శాతం అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని, మేనిఫెస్టో అంటే ఎన్నిక‌లు అయిపోగానే.. మ‌రిచిపోయే కాగితం కాద‌ని స‌భ‌లో వెల్ల‌డించారు. పాల‌కులు ప్ర‌జా సేవ పారాయ‌ణులు అయితేనే స‌మాజం బాగుంటుంద‌న్నారు. 

కరోనా మహమ్మారిపై పోరాటంలో మనం ముందున్నాం అని మంత్రి అన్నారు. కరోనా విపత్తు పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చూశామన్నారు. కరోనా సంక్షోభం సమయంలోనూ సంక్షేమంపై వెనకడుగు వేయలేదన్నారు. 2018-19లో స్థూల ఉత్పత్తి 8 శాతమే పెరిగిందని చెప్పారు. 
పేదల కష్టాలను తీర్చడానికి నవరత్నాల అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ది అసాధ్యమని మంత్రి స్పష్టం చేశారు. అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అంటూ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు ఆర్థిక మంత్రి బుగ్గన.

ఏపీ బడ్జెట్‌(2020-21) హైలైట్స్:
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

వివిధ పథకాలకు కేటాయింపులు:
అభివృద్ధి పథకాలకు రూ.84,140.97 కోట్లు
ఎస్సీల అభివృద్ధికి రూ.15,735.68 కోట్లు
ఎస్టీకు రూ.5,177.53 కోట్లు
బీసీలకు గతంలో పోలిస్తే 68.18శాతం అధికం
బీసీల అభివృద్ధికి రూ.25,331.30 కోట్లు
మైనార్టీల అభివృద్ధికి 2050.22 కోట్లు
మైనార్టీలకు గతేడాదితో పోలిస్తే 116.10 శాతం అధికం
కాపుల సంక్షేమానికి రూ.2874 కోట్లు

వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ.16వేల కోట్లు
వైఎస్ఆర్ ఆసరాకు రూ.6300 కోట్లు
అమ్మఒడి రూ.6వేల కోట్లు
జగనన్న విద్యాదీవెన రూ.3009 కోట్లు
వైఎస్ఆర్ చేయూత రూ.3వేల కోట్లు
జగనన్న వసతి దీవెన రూ.2వేల కోట్లు
వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.350 కోట్లు
వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు
వైఎస్ఆర్ జగనన్న చేదోడు రూ.247 కోట్లు
వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా రూ.109 కోట్లు
జగనన్న తోడు రూ.100 కోట్లు
ఇమామ్, మౌజమ్ లకు రూ.50 కోట్లు
లా నేస్తం రూ.12.75 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు
రియల్‌ టైం గనర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు
వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు
వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు
104, 108 లకు రూ.470.29 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు