Ap Cabinet : ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో...ఏ క్లాస్ అయినా...సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు.

Ap Cabinet : ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి

Ap Cabinet

Updated On : August 6, 2021 / 6:50 PM IST

Perni Nani Press Meet : ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో…ఏ క్లాస్ లో అయినా…సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా బోధన చేసే ప్రతి తరగతిలో తెలుగు కంపల్సరీగా ఉంటుందని, విద్యావ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Read More : Fruit Juices : బరువు తగ్గాలనుకునే వారు… ఎలాంటి జ్యూస్ లు తాగాలంటే…

2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యారంగంలో సమూల మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. నాడు – నేడు కింద 34 వేల పాఠశాలలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

Read More : Rajiv Gandhi Khel Ratna: మేజర్ ధ్యాన్ చంద్ మూడు సార్లు ఒలింపిక్ గోల్డ్ విన్నర్ అని మీకు తెలుసా

2019 – 2021 దాక 6 లక్షల 22 వేల 856 మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి నమోదు చేసుకున్నారని వివరించారు. ఏ స్కూల్ మూయకూడదు, ఏ టీచర్ తీయవద్దనే భావనతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకరావాలని, ఏ ఒక్క పేదింట్లో పిల్లవాడు చదువు మానకూడదనే ఉద్దేశ్యంతో పలు పథకాలు తీసుకరావడం జరిగిందన్నారు. ఎన్ని సమస్యలున్నా..అధిగమిస్తూ..ముందుకెళుతున్నామన్నారు.

ఈ నెలలో అమలు చేయనున్న నవరత్నాలతో పాటు.. పలు పథకాలపై ఏపీ మంత్రివర్గం చర్చించింది. హెచ్‌ఆర్‌సీ కార్యాలయాన్ని.. కర్నూలులో ఏర్పాటు చేయడంతో పాటు, లోకాయుక్తను కూడా అక్కడికే తరలించే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుడగట్లపాలెం, పూడిమడక, ఓడలేరు, బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి.., మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలకు ఆమోదముద్ర వేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులకు కూడా ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.

Read More : International Beer Day : ‘బీర్‌’ పుట్టుకకు మూలం మహిళలే..బీరు డే ‘అలా మొదలైంది’..