Parawada Pharmacy Fire : పరవాడ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.

Parawada Pharmacy Fire : పరవాడ ఫార్మాసిటీ అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

cm jagan

Parawada Pharmacy Fire : అనకాపల్లి జిల్లా పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు. సీఎం జగన్ ఆదేశాలతో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. గాయపడిన వారికి అత్యవసర, మెరుగైన వైద్యం అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. లారస్ ఫార్మా సిటీలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం జగన్ విచారణకు ఆదేశించారు.

పరవాడ లారస్ ఫార్మాసిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరస్థితి విషమంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో లారెస్ ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. లారెస్ ఫార్మా కంపెనీలో యూనిట్-3లో మంటలు చెలరేగాయి. ఎంబీ6 బ్లాక్ లో రియాక్టర్ కింద రబ్బరుకు మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Fire In Parawada Pharma City : అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

అగ్నికిలలు రబ్బరు పరికరాలకు అంటుకుని గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు వ్యాపించాయి. డ్రాయర్ రూమ్ నుంచి కెమికల్ ఫైర్ అవ్వడంతో అగ్నిప్రమాదం సంభవించింది. నిమిషాల్లోనే మంటలు ఎగబాకడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని కేజీహెచ్, కిమ్స్ ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు.

మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన బంగి రాంబాబు, గుంటూరుకు చెందిన రాజేశ్ బాబు, అనకాపల్లి జిల్లా కే.కోతపాడుకు చెందిన రాపాటే రామకృష్ణ, అనకాపల్లి జిల్లా చోడవరంకు చెందిన మజ్జి వెంకట్రావుగా గుర్తించారు. అయితే విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన ఎడ్ల సతీష్ పరిస్థితి విషమంగా ఉంది. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.