హ్యాపీ బర్త్ డే : సీఎం జగన్‌కు మోడీ శుభాకాంక్షలు

  • Published By: madhu ,Published On : December 21, 2019 / 05:08 AM IST
హ్యాపీ బర్త్ డే : సీఎం జగన్‌కు మోడీ శుభాకాంక్షలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేక్‌లు కట్ చేసి విషెస్ తెలియచేస్తున్నారు. పేదలకు పండ్లు పంచిపెడుతున్నారు. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియచేస్తున్నారు. 

* ఏపీ సీఎం జగన్ ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు భారత ప్రధాని మోడీ. సీఎం జగన్‌కు విషెస్ చెబుతూ…డిసెంబర్ 21వ తేదీ శనివారం ట్విటర్ వేదికగా ట్వీట్ చేశారు. 
* అలాగే..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కూడా ట్వీట్ చేశారు. కలకాలం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాక్షించారు. 

* ఏపీ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్వీట్ చేశారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. 
 

 

* మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నిర్మాత, నటుడు బండ్ల గణేష్. 
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని వైఎస్ చౌదరి ట్వీట్ చేశారు. 
* రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ వెరైటీగా ట్వీట్ చేశారు కేశినేని నాని. మరికొంతమంది ట్వీట్స్ చేశారు.