Amravati: ఢిల్లీ టూర్ తరువాత..గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.

Amravati: ఢిల్లీ టూర్ తరువాత..గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

Governor To Cm Jagan

Governor To CM Jagan : సీఎం వైఎస్ జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం గవర్నర్ తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ గవర్నర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీ సీఎం జగన్‌ బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్‌ గోయల్‌, షెకావత్‌‌, జవదేకర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌ కుమార్‌లను కలిశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వారితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి సీఎం జగన్ చర్చలు జరిపారు. నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న జగన్ రాత్రి వరకు వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం రాత్రి 9 గంటల నుంచి 10.35 వరకు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. శుక్రవారం ఉదయం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ను సీఎం జగన్ కలిశారు.

అలా పలువురు మంత్రుల్ని కలిసి సీఎం తిరిగి ఏపీ చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన అనంతరం గవర్నర్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ టూర్ తరువాత గవర్నర్ ను కలవం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటి సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం అయి పలుఅంశాలపై చర్చించనున్నారు.