CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా

32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. 32మందిలో కీలక మంత్రులు కూడా ఉన్నారు. పని తీరు బాగోలేని మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, విడదల రజని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, సిదిరి అప్పలరాజు ఉన్నారు.

CM Jagan Warning : ఆ 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్.. వారిలో మంత్రులు కూడా

CM Jagan Warning : గడపగడపకు కార్యక్రమంపై జరిగిన సమీక్షలో 32మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. 32మందిలో కీలక మంత్రులు కూడా ఉన్నారు. పని తీరు బాగోలేని మంత్రుల్లో బొత్స సత్యనారాయణ, విడదల రజని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, సిదిరి అప్పలరాజు ఉన్నారు.

పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలలో మద్దిశెట్టి వేణుగోపాల్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ నాయుడు, మహేందర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇక్బాల్ తో పాటు పలువురు ఉన్నారు. 32మంది తమ పనితీరు మెరుగు పరుచుకోవాలని, ప్రతి ఎమ్మెల్యే ప్రతి సచివాలయంలో 6 గంటలు గడపాలని సూచించారు. జనవరి నుంచి పెరిగే పెన్షన్ పెంపును ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలన్న జగన్.. మార్చిలో మరోసారి సమీక్ష నిర్వహిస్తానన్నారు.

Also Read..CM Jagan : వైసీపీలో కలకలం.. ఆ 40మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ అసంతృప్తి

”రెండు రోజులు ప్రతి సచివాలయం పరిధి మినిమమ్ ఉండాలి. ప్రతి సచివాలయంలో కనీసం 6 నుంచి 7 గంటల పాటు ఉండాలి. ప్రతి రోజూ ప్రతి సచివాలయానికి కనీసం 12 నుంచి 14 గంటలు కేటాయించాలి. మీ కోసం చేస్తున్న ఎక్సర్ సైజ్ ఇది. దయచేసి జాగ్రత్తగా చేయండి. క్వాలిటీ ఓరియంటెడ్ గా చేయండి. క్వాంటిటీ ఓరియెంటెడ్ గా చేయకండి.

ప్రజలకు మీరు కనెక్ట్ కాబోయే గొప్ప కార్యక్రమం ఇది. ఇక్కడ మీరు ప్రజలకు కనెక్ట్ అయితే, ప్రజల మన్ననలు పొందితే రేపు మీరు గెలవడం కోసం ఏకైక కార్యక్రమం ఇది. ఇక్కడ తొందరపడొద్దు. ఎవరినో మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేయకండి. రెండు రోజులు కాకపోతే నాలుగు రోజులు చేయండి. అయితే చేసే పని క్వాలిటీగా చేయండి. అందరం గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని కోట్ల మంది డిపెండ్ అయ్యారు. మనం కనుక మనం చేయాల్సిన బాధ్యత మనం చేయకపోతే కోట్ల మంది నష్టపోతారు. ఈరోజు యుద్ధం జరుగుతోంది అంటే.. పేదవారికి, పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ రోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది కులాల మధ్య కాదు. క్లాష్ వార్. పేదవాడికి, పెత్తందారి మనస్తత్వం ఉన్నవారికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. ప్రతి పేదవాడికి రెప్రంజేటివ్ ఎవరు అంటే మనమే. మనం నష్టపోతే పేదవాడు నష్టపోతాడు. మనం అధికారంలోకి పొరపాటున రాలేదంటే రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం చేయలేము. మోసంతో కూడిన రాజకీయాలు, ప్రజలను వాడుకుని వదిలేసే రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు. అబద్దాల రాజకీయాలు.

ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు. పేద వాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు అంటే. అటువంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అంతా ధ్యాస పెట్టమని చెబుతున్నా. ప్రతీ ఇంట్లోనూ కనీసం అంటే ఒక నిమిషమో, రెండు నిమిషాలో, మూడు నిమిషాలో గడపండి. ప్రతి ఇంటికి వెళ్లి 5 నిమిషాలు ఉండండి. ఆ 5 నిమిషాలే మీ డెస్టినినీ చేంజ్ చేస్తాయి. ప్రతీ గడపకు వెళ్లేందుకు మీ దగ్గర టైమ్ ఉంది. ఈ రోజు మీ బిగ్గెస్ట్ వెపన్ టైమ్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్. ఎన్నికలకు ఒక నెల ముందో రెండు నెలల ముందో ఈ పని చేస్తే ప్రయోజనం ఉండదు” అని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ అన్నారు.

Also Read..CM Jagan Target 175 : కొత్తగా 5లక్షల 20వేల మంది నియామకం.. 175 స్థానాలే లక్ష్యంగా సీఎం జగన్ ఖతర్నాక్ స్కెచ్