ఏపీలో కరోనా కల్లోలం.. వరుసగా 10వేలకు పైగా కేసులు

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 09:58 PM IST
ఏపీలో కరోనా కల్లోలం.. వరుసగా 10వేలకు పైగా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. మరణాల సంఖ్య కూడా అలానే కనిపిస్తోంది. రాష్ట్రంలో వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69,623 శాంపిల్స్‌ని పరీక్షించారు.



వీరిలో 10,825 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,87,331కి చేరింది. ఈ రోజు మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు.. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4347కి చేరింది. ఏపీలో 11,941 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.



నెల్లూరులో 13 మంది, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, చిత్తూరులో ఏడుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశం, కడపలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు మృతిచెందారు. ఇప్పటి వరకు ఏపీలో 3,82,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,00,880 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.