Suryanarayana : పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందే : సూర్యనారాయణ

పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని పేర్కొన్నారు. ఇవాళ్టి భేటీలో కూడా ఇదే తీర్మానించామని పేర్కొన్నారు.

Suryanarayana : పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందే : సూర్యనారాయణ

Suryanarayana

PRC commission report : సీఎస్, ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ ఫైట్ ముదురుతోంది. సీఎస్ సమీర్ శర్మ, ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ మధ్య ఐఆర్ పై మాటల యుద్ధం నడుస్తోంది. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని సీఎస్ చెబుతుంటే, కాలయాపన కోసమే చర్చల ప్రతిపాదన తీసుకొచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సీఎస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై కమిటీ సభ్యులు భేటీలో చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపైనా స్టీరింగ్ కమిటీ చర్చించింది. ఇదిలావుంటే చర్చలకు రావాలంటూ ఉద్యోగ సంఘాలకు సజ్జల, సీఎస్ ఆఫర్ ఇచ్చారు.

అనంతరం పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి, ఉద్యోగ సంఘం నేత మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని పేర్కొన్నారు. ఇవాళ్టి భేటీలో కూడా ఇదే తీర్మానించామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కనీస వేతనంపై ఐదుగురి సభ్యులతో కమిటీ వేసిందన్నారు. కనీస వేతనంపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ 2018లో నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిటీ.. కేంద్ర కమిటీ నివేదికను అనుసరించిందా..లేదా? అని అడిగారు. ఆర్టీసీ జేఏసీ సంఘాలు తమతో సమన్వయం అయ్యాయని చెప్పారు.

ఆర్టీసీ జేఏసీ సంఘాలు కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చాయని గుర్తుచేశారు. విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సంఘాలు కూడా నోటీసులు ఇచ్చాయని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ సంఘాలు కూడా సమ్మెలోకి వస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ, విలేజ్ వార్డ్ ప్రతినిధుల్ని కూడా స్టీరింగ్ కమిటీలోకి తీసుకుంటామని తెలిపారు. తాము ఇప్పటికే 13వ వేతన సవరణలో ఉండాలన్నారు. ఇప్పుడు 11వ వేతన సవరణ జరుగుతోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు రెండుసార్లు పీఆర్సీ కోల్పోయారని వాపోయారు.

అధికారులకు ఉన్నంత తెలివితేటలు తమకు లేవని ఎద్దేవా చేశారు. ఐఆర్ అంటే అర్థమేంటో వికీపీడియా, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో వెతికామని చెప్పారు. ఐఆర్ అంటే మధ్యంతర ఉపశమనం అనే ఉందన్నారు. ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇవాళ ఇచ్చిన పీఆర్సీని కూడా రేపు రుణం అని అంటారేమో అర్థం కావడంలేదన్నారు. కమిషన్లతో ఈ ప్రభుత్వం కాలం గుడుపుతోందని విమర్శించారు.