పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం!

పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం!

AP SEC

AP government angry over SEC decision : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై ఏపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కరోనా వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో… షెడ్యూల్ ఇవ్వడం ఏంటని మండిపడుతోంది. ఎస్ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ని నిలువరించాలని ఏపీ ప్రభుత్వం కోరే అవకాశాలున్నాయి. కరోనా వ్యాక్సిన్ సన్నద్ధతలో అధికారయంత్రాంగం అంతా ఉందని, వ్యాక్సిన్ నేషన్ వల్ల స్థానిక ఎన్నికల నిర్వాహణ సాధ్యం కాదని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘననే అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యాఖ్యానించారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియలో ఉన్నామని చెప్పినా..మొండి వైఖరి అవలంబిస్తున్నారని తెలిపారు.

మరోవైపు..ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ.. సాయంత్రం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో భేటీ అయింది. ఎన్నికల ప్రక్రియపై చర్చించింది. కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టబోతున్నామని, ప్రస్తుత సమయంలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని అధికారుల బృందం ఎస్ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. అధికారులతో చర్చించిన వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం గమనార్హం.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు
ఫిబ్రవరి 13న మూడో దశ పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు
ఉదయం 6:30 గంటల నుంచి మ.3:30 వరకు పోలింగ్‌
పోలింగ్‌ రోజే సా.4 గంటలకు ఓట్ల లెక్కింపు