Agri Gold : ఈ నెల 24న ఖాతాల్లో డబ్బులు.. అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ ప్రభుత్వం శుభవార్త, ఇలా నమోదు చేసుకోవాలి

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్‌ ఆ డిపాజిట్‌ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.

Agri Gold : ఈ నెల 24న ఖాతాల్లో డబ్బులు.. అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ ప్రభుత్వం శుభవార్త, ఇలా నమోదు చేసుకోవాలి

Agri Gold : అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం జగన్‌ ఆ డిపాజిట్‌ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు.

అర్హులైన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. ఎవరైనా డిపాజిట్‌ దారుడు మరణిస్తే లీగల్‌ హైర్ సర్టిఫికెట్‌ చూపాలని, నగదును వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమచేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక డిపాజిట్‌ దారుడు ఒక క్లెయిమ్‌కు మాత్రమే అర్హులు. గతంలో రూ.10వేల లోపు డిపాజిట్‌ క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు.

అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పలు విడుతల్లో చెల్లింపులు చేశారు.