సౌమ్యుడిగా ఉండే ఆ లీడర్ ఎందుకు సంచలన కామెంట్స్ చేసినట్లు?
ఇచ్చాపురం వివాదం సమసిపోకముందే.. టెక్కలిలో ఓ సభలో కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలికట్ కాంట్రవర్సీకి, కుల చిచ్చుకు దారి తీసేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
Dharmana Krishnadas
Dharmana Krishnadas: స్పైసీ కామెంట్స్..హాట్ హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ సిక్కోలు జిల్లా. కింజరాపు ఫ్యామిలీ, ధర్మాన సోదరులు, మామ అల్లుల్లు తమ్మినేని, కూన రవి, దువ్వాడ, సీదిరి అప్పలరాజు ఇలా సీనియర్ నేతల మాటల తూటాలతో జిల్లాలో రాజకీయం ఎప్పుడూ వాడీవేడీగానే ఉంటుంది. అయితే ఇలాంటి కీలక నేతల్లో కూల్ పాలిటిక్స్ చేసే లీడర్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది ధర్మాన బ్రదర్స్. అందులో ధర్మాన కృష్ణదాస్ అయితే నాన్ కాంట్రవర్సీ లీడర్ అనే పేరుంది.
తాను నమ్మిన సిద్దాంతాల కోసం సొంత కుటుంబాన్ని, తమ్ముడు ధర్మాన ప్రసాదరావుని కాదని మరి తన పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారాయన. వైసీపీలో జగన్ కూడాడా ఆయనకు కీలక స్థానం ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే ఏకంగా రెవిన్యూమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్‌ను అప్పగించారు జగన్. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా కృష్ణదాస్‌కి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పారు వైసీపీ అధినేత.
Also Read: కౌంటర్ స్కెచ్.. టీడీపీ జిల్లా కమిటీలతో జోష్..! అందుకే వారిని స్ట్రాంగ్ చేస్తున్న చంద్రబాబు
కృష్ణదాస్ రాజకీయం అంతా పాము చావదు కర్ర విరగదు అన్నట్లుగా ఉంటుందనేది జిల్లాలో టాక్. ఎన్ని ప్రజా సమస్యలు ఉన్నా..ఆయన అధికార పక్షాన్ని కూడా సుతి మెత్తగానే విమర్శిస్తూ ఉంటారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ధర్మాన క్రిష్ణదాస్ వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారుతుంది. కృష్ణదాస్ ఏం మాట్లాడినా అది వివాదాలకు దారి తీస్తుంది. ఇటీవల కృష్ణదాస్ వ్యవహారంపై వైసీపీ అధినేత దగ్గరనే పంచాయితీ పెట్టారట జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ దంపతులు.
బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌కు మొర
ధర్మాన కృష్ణదాస్ ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని తమతో మిగిలిన నేతలు కలిసిరావడంలేదని ఇలా రాజకీయం చేయలేమని అవసరమైతే తమని నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పించాలని జగన్‌కు మొర పెట్టుకున్నారట. దీనికి కారణం కూడా చెప్పుకొచ్చారట. ఇచ్చాపురంలో ఎమ్మెల్సీ రామారావు ఇంటి దగ్గర సమావేశమై నియోజకవర్గంలో ఇంచార్జ్ లేరని అందరూ సమన్వయకర్తలేనని మీటింగ్‌లో చెప్పారంటూ వాపోతున్నారట పిరియా విజయా సాయిరాజ్ దంపతులు.
ఇచ్చాపురం వివాదం సమసిపోకముందే.. టెక్కలిలో ఓ సభలో కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలికట్ కాంట్రవర్సీకి, కుల చిచ్చుకు దారి తీసేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేత తమ్మినేని సీతారాంకు వయస్సు అయిపోయిందని అర్ధం వచ్చేలా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జ్‌గా ఉన్న సీతారాంకు నామినేటెడ్ పదవి ఇచ్చి పార్లమెంట్ పగ్గాలు యవతకు ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో పెద్ద దుమారమే రేపాయి. 70 ఏళ్ల కృష్ణదాస్ .. సీనియర్ నేత సీతారాంపై అలా మాట్లాడమేంటని..ఎంతో చరిష్మా కలిగి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేతను కృష్ణదాస్ ఎలా పదవి నుంచి తప్పిస్తారంటూ తమ్మినేని అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.
అగ్నికి అజ్యం పోసినట్లు మధ్యలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏంట్రీ అయ్యి.. ఈ వివాదానికి కులం రంగు పులిమారు. కళింగ కులంలో కీలక నేత అయిన తమ్మినేనిని రాజకీయంగా తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ దువ్వాడ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో కృష్ణదాస్ ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చిందంటున్నారు. సైలెంట్ పాలిటిక్స్ చేసే ధర్మాన కృష్ణదాస్ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా మారడంతో సిక్కోలు వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట.
