Recruitment : కరోనా నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం, పెద్దఎత్తున నియామకాలకు అనుమతి

రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో అదనంగా సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు కొవిడ్ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Recruitment : కరోనా నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం, పెద్దఎత్తున నియామకాలకు అనుమతి

Recruitment

Recruitment : రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ రోగులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని.. అందుకు తగ్గట్టుగా వైద్య సిబ్బంది నియామకానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొవిడ్ ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని.. అందుకు తగ్గట్టుగా వైద్య సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిలో 1,170 స్పెషలిస్టులు, జనరల్‌ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2వేల మంది స్టాఫ్ నర్సులు, 306 మంది అనస్థీషియా టెక్నీషియన్లు, 300 మంది ఎఫ్ఎన్‌వోలు, 300 మంది ఎమ్ఎన్‌వోలు, 300 మంది స్వీపర్లను ఆరు నెలల పాటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

* కొవిడ్ రెండోదశను ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
* కొవిడ్ ఆసుపత్రులలో నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు
* స్పెషలిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది నియామకం
* ఉత్తర్వులు జారీచేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర
* కొవిడ్ తో బాధపడుతున్న పేషెంట్లకు ఇక పూర్తి స్థాయిలో వైద్య సేవలు
* కొవిడ్ నిర్వహణకు రంగంలోకి దిగనున్న మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు

* 1170 స్పెషలిస్టులు, 1170 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ల నియామకం
* 2వేల మంది స్టాఫ్ నర్సులు, 300 మంది అనస్థీషియా టెక్నీషియన్ల నియామకానికి ఉత్తర్వులు
* అలాగే 300 మంది ఎఫ్ఎన్వోలు, 300 మంది ఎమ్మెన్వోల నియామకం
* 300 మంది స్వీపర్ల నియామకం
* 6 నెలల కాలపరిమితికి కాంట్రాక్టు పద్ధతిలో నియామకం
* కొవిడ్ ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు