AP : నూతన మద్యం పాలసీ, తిరుపతిలో నో లిక్కర్!

2021 - 22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి వరకు మద్యం విక్రయాలను నిషేధించారు.

AP : నూతన మద్యం పాలసీ, తిరుపతిలో నో లిక్కర్!

Ap

AP Excise Policy : ఏపీలో నూతన మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. 2021 – 22 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానంపై గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2 వేల 934 దుకాణాల్లో మద్యం విక్రయాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్సుల కాలపరిమితి 2022 సెప్టెంబరు 30 వరకు ఉంటుందని గెజిట్‌లో పేర్కొంది. తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి అలిపిరి వరకు మద్యం విక్రయాలను నిషేధించడంతో పాటు ఆ ప్రాంతంలో మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూములను అనుమతించబోమని తేల్చిచెప్పింది ప్రభుత్వం.

Read More : Pawan kalyan : జనసేనాని శ్రమదానంపై టెన్షన్..రోడ్లను బాగు చేస్తున్న అధికారులు

రిటైల్‌ అవుట్‌లెట్ల సంఖ్యలో ఎటువంటి మార్పు చేయలేదు. వాక్‌-ఇన్‌స్టోర్ల ఏర్పాటుకు బేవరేజస్‌ కార్పొరేషన్‌కు అనుమతులు మంజూరు చేసింది. విక్రయాలు, లావాదేవీల్లో పారదర్శకత కోసం ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ విధానం అమలు చేయనున్నారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ విధానంలో చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. టూరిజం ఫెసిలిటేన్‌ కేంద్రాల్లో మద్యం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం.. జాతీయ రహదారుల వెంట మద్యం అమ్మకాలపై సమీక్షిస్తామని ఎక్సైజ్‌శాఖ ప్రకటించింది.