AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రైతులకు ఊరట..

గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్డీఏ మంజూరు చేసింది. అయితే ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో ఉన్న భూములకు కౌలు నిధులను ప్రభుత్వం నిలుపుదల చేసింది.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రైతులకు ఊరట..

Ap Govnament

AP Government: గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వార్షిక కౌలును ఎట్టకేలకు సీఆర్డీఏ మంజూరు చేసింది. అయితే ఈ ఏడాది కూడా వివాదాలు, విచారణలో ఉన్న భూములకు కౌలు నిధులను ప్రభుత్వం నిలుపుదల చేసింది.

AP Governor : ఢిల్లీలో ఏపీ గవర్నర్ బిజీబిజీ.. ముగిసిన ఐదు రోజుల పర్యటన..!

ప్రతియేటా మే నెల మొదటి వారంలో రైతులకు కౌలు డబ్బులు వారి వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా ప్రభుత్వం కౌలు డబ్బులు చెల్లింపులో ఆలస్యం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము భూములిచ్చి కౌలు డబ్బులకోసం సీఆర్డీఏ కార్యాలయం, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన కౌలు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసింది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం రూ. 195 కోట్లకు బడ్జెట్ విడుదల చేయగా.. రూ. 188 కోట్లను కౌలు కింద చెల్లించారు.

Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కౌలు చెల్లింపు కోసం రూ. 208 కోట్లుకు బడ్జెట్ ను విడుదల చేసింది. 23వేల మందికిపైగా రైతులకు రూ. 184 కోట్లను వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. సోమవారం రూ.112 కోట్లు, మంగళవారం రూ. 72 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. వివాదాలు, కోర్టుల్లో విచారణలో భూములకు సంబంధించి రూ. 15కోట్లు వరకు కౌలు ఇవ్వాల్సి ఉంది. సమస్య పరిష్కారం అయితేనే కౌలు ఇస్తామని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు.