Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..

మ‌హారాష్ట్రలో కొన‌సాగుతున్న రాజ‌కీయ ఉత్కంఠ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానుంది. అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేయాల‌ని ఆ రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌వ‌త్ సింగ్ కోశియారి ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంట‌లలోపు సీఎం ఉద్ద‌వ్ త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గాల్సి ఉంటుంది.

Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..

Uddhav Thackeray (1)

Maharashtra political crisis: మ‌హారాష్ట్రలో కొన‌సాగుతున్న రాజ‌కీయ ఉత్కంఠ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న‌ది. గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్న‌ది. అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేయాల‌ని ఆ రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేను గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌వ‌త్ సింగ్ కోశియారి ఆదేశించారు. గురువారం సాయంత్రం 5 గంట‌లలోపు సీఎం ఉద్ద‌వ్ త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గాల్సి ఉంటుంది. అయితే ఆ అసెంబ్లీ స‌మావేశాల్ని రికార్డ్ చేయాల‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌ కోశియారి త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. బీజేపీ సహా స్వతంత్ర ఎమ్మెల్యేల విజ్ఞప్తుల మేరకు ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో బలనిరూపనకు ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయంపై స్టేకోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలోనూ ఉద్ధవ్ ఉన్నట్లు సమాచారం.

Maharashtra political crisis: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఏకనాథ్ షిండే అడుగులు..పేరు కూడా ఖరారు?!

మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఇన్నాళ్లు తెరవెనుక నుండి మద్దతు తెలిపిన బీజేపీ.. తాజాగా లైవ్ లోకి వచ్చింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణం ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు నేరుగా బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ నేతలు.. మహా ‘సంక్షోభం’ చివరి దశకు చేరుకుంటున్న క్రమంలో పావులు వేగంగా కదుపుతున్నారు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డాలతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గవర్నర్‌ కోశ్యారీతో ఫడ్నవీస్ భేటీ అయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిమిత్తం సీఎంను ఆదేశించాలని కోరారు. ఇదే సమయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది తాము శివసేన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని, సర్కారు మైనార్టీలో పడిందంటూ గవర్నర్ కు లేఖను పంపించారు. ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలం నిరూపించుకోవాలని, ఆ మేరకు ఆదేశించాలని కోరుతూ గవర్నర్ కు ఈ మెయిల్ పంపించారు. ఇదంతా ఫడ్నవీస్ రాజ్ భవన్ కు వెళ్లడానికి ముందే జరగడం గమనార్హం.

Viral Video: చూస్తుండగానే నదిలో కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. వీడియో వైరల్

ప్రతిపక్ష బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్ర ఎమ్మెల్యేల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని గవర్నర్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ రాశారు. రేపు సాయంత్రం 5గంటల వరకు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని కోరారు. అసెంబ్లీలో రేపు బల నిరూపణకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు బలనిరూపణను నిలుపదల చేసేలా స్టేకోసం సుప్రింకోర్టును ఆశ్రయించే యోచనలో ఉద్ధవ్ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి బీజేపీ వ్యూహాలు ఫలిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.