AP PRC Strike : సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు | AP Govt Employees Union Leaders Strike Notice

AP PRC Strike : సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు

ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది. ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు...

AP PRC Strike : సమ్మెకే సై అన్న ఉద్యోగ సంఘాలు

AP Govt Employees : ఉద్యోగులు చెప్పినట్టే చేశారు.. సమ్మె దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు. దీంతో ఫిబ్రవరి 7 నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఖాయమైంది. ప్రస్తుత పీఆర్సీతో తమకు నష్టమని భావిస్తున్న ఉద్యోగులు.. మెరుగైన పీఆర్సీ కోసం చర్చల కంటే పోరుబాటకే మొగ్గు చూపారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలవుతుందని స్టీరింగ్‌ కమిటీ ప్రకటించింది. ఏక పక్షంగా పీఆర్సీ జీవోలను అమల్లోకి తెచ్చినందుకే ఉద్యమ బాట పట్టినట్టు నోటీసులో ప్రస్తావించారు ఉద్యోగులు. తాము సమ్మె చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనన్న అంశాన్ని సమ్మె నోటీసులో ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

Read More : AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు

అంతకుముందు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగ సంఘ నేతలు తిరస్కరించారు.. కమిటి పరిధి ఏంటో తెలియనప్పుడు చర్చలకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు.. ఇప్పటి వరకు 12సార్లు చర్చలకు వెళ్లామని.. అయినా ప్రయోజనం లేనప్పుడు ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తూ సమ్మె వైపే మొగ్గు చూపారు.. పీఆర్సీ జీవోలను ఉపసంహరిస్తేనే చర్చలకు వస్తామని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. పీఆర్సీ జీవోలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో…. పీఆర్సీ సాధన సమితి నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరగటానికి ముందు ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజుకు మంత్రి పేర్నినాని, సూర్యనారాయణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫోన్‌ చేసి సంప్రదింపులకు రావాలని కోరారు.

Read More : Stock Market : బ్లాక్ మండే, 19 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చారు. మంత్రుల చర్చల ఆహ్వానంపైనా స్టీరింగ్‌ కమిటీలో చర్చించారు. అనంతరం మంత్రి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఏకపక్షంగా ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు తాము ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. పీఆర్సీ జీవోలను రద్దు చేసిన తర్వాతే చర్చలకు వెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి జేఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఫోన్‌ చేసి ప్రభుత్వం వేసిన సంప్రదింపుల కమిటీతో చర్చలకు రావాలని ఆహ్వానించారు. ఇవాళ మంత్రులు సచివాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రభుత్వం అధికారికంగా కమిటీ వేయకుండా ఆ కమిటీతో చర్చలేమిటని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు.. ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని పెట్టాలని కోరారు. ఈ నెల పాత జీతాలు ఇవ్వాలని, జీవోలు రద్దు చేసే వరకు ఎలాంటి చర్చలకూ వచ్చేది లేదని శశిభూషణ్‌కుమార్‌కు స్పష్టం చేశారు. శశిభూషణ్‌ కుమార్‌ నచ్చచెప్పే ప్రయత్నం చేయగా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఊరకనే చర్చలకు రాబోమని, చర్చలకు పిలవాలన్నా చట్టబద్ధమైన కమిటీ ఏర్పడితే తప్ప ఆలోచన చేయలేమని తేల్చి చెప్పారు.

Read More : AP Corona Cases : ఏపీలో కరోనా ఉగ్రరూపం.. మరోసారి 14వేలకు పైగా కేసులు, ఏడు మరణాలు

సూర్యనారాయణ : – పీఆర్సీ జీవోలు ఇవ్వడం..దాని పర్యావసనం పెరుగుదల బరువు తరుగుదల రిజల్ట్ అయినటువంటి నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగులు వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేసినా…అధికారుల కమిటీ చెప్పిన మాటలను పదే పదే చెబుతున్న్నారని ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యరాయణ విమర్శించారు. యావాత్త పౌర సమాజాన్ని ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని భావిస్తున్నామన్నారు. నాలుగు జేఏసీలు ఒక స్ట్రగుల్ కమిటీగా ఏర్పడడం జరిగిందన్నారు. బలవంతంగా వేతన సవరణ రుద్దాలనే ప్రయత్నాన్ని ఆపి ఒక నెలకు పాత జీతాలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తమకు జీవో ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకమో…రాజకీయ వివాదానికి తావిచ్చేలాగా ఉండకూడదన్నారు.

బండి శ్రీనివాసరావు : – రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉద్యోగులు ర్యాలీలు నిర్వహిస్తారని బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఉద్యోగులందరూ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో 12 సార్లు చర్చిస్తే…న్యాయం జరగలేదన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అధికారుల కమిటీ పీఆర్సీ రిపోర్టును బయటపెట్టాలన్నారు.

వెంకట్రామిరెడ్డి : – ఉద్యోగ సంఘాల అపోహలను తొలించేందుకు కమిటీ వేశామని ప్రభుత్వం చెబుతోందని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా పీఆర్సీ జీవోలు ఇచ్చిందని బొప్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్ మెంట్ తప్ప ఏ అంశంపైనా చర్చలు జరగలేదన్నారు. జీఏడీ ప్రిన్స్ పల్ సెక్రటరీకి సమ్మె నోటీసు అందించామన్నారు.

×