నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్ : 20వేల ఉద్యోగాలు భర్తీ

ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 07:07 AM IST
నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్ : 20వేల ఉద్యోగాలు భర్తీ

ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో

ఏపీలో ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ పోస్టుల భర్తీపై జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 2020 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 20వేల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2020 నుంచి ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్ లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. అందుకు తగ్గట్టుగానే టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పోస్టుల భర్తీకి ముందుగా టీచర్‌ అర్హత పరీక్షను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతంలో టీచర్‌ అర్హత పరీక్ష (టెట్‌)ను, టీచర్‌ నియామక పరీక్ష (టీఆర్టీ)ని కలిపి టెట్‌ కమ్‌ టీఆర్టీగా నిర్వహించారు. అయితే, ఈసారి రెండింటిని వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం.. టెట్‌ను ఏటా 2సార్లు నిర్వహించాలి. 2018లో టెట్‌ను ఒకసారి నిర్వహించారు. 2019 లో ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర కారణాలతో దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో.. ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్, డీఎస్సీల నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు. డీఎస్సీ కన్నా ముందుగా టెట్‌ నోటిఫికేషన్‌ను జనవరి మొదటి వారంలో.. ఆ తర్వాత నెలాఖరున డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి.

ఈసారి సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధనా నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండేలా టెట్, డీఎస్సీలలో సంబంధిత అంశాలపై ప్రశ్నలు పొందుపర్చనున్నారు. టెట్‌ పేపర్-1, 2 రెండింటిలోనూ ఇంగ్లీష్ ప్రావీణ్యంపై ప్రశ్నలున్నాయి. పేపర్-2ఏలో భాషాంశాలు, కమ్యూనికేషన్‌ ఇతర సమగ్ర నైపుణ్యాలు పరీక్షిస్తున్నారు. కాగా, డీఎస్సీ-2018లో కొన్ని ప్రత్యేక పోస్టులకు ఇంగ్లీష్ నైపుణ్యాలపై ఒక పేపర్‌గా పెట్టారు. ఈసారి ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ఎంపికయ్యే టీచర్లలో ఇంగ్లీష్ నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక పేపర్‌ పెట్టనున్నారు. అలాగే, టెట్‌లో ఇప్పుడు అడుగుతున్న అంశాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నారు. డీఎస్సీలో అన్ని కేటగిరీల పోస్టులకూ ప్రత్యేక పేపర్‌ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగ కేలండర్ విడుదల చేస్తామని సీఎం జగన్ ఇది వరకే ప్రకటించారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి సీఎం జగన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 20వేల టీచర్ పోస్టుల భర్తీ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.