Minister Sucharitha : గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్తున్నాడు : హోంమంత్రి సుచరిత

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి సుచరిత కౌంటర్ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారంటూ మండిపడ్డారు.

Minister Sucharitha : గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్తున్నాడు : హోంమంత్రి సుచరిత

Sucharitha

Minister Sucharitha fired ayyanna patrudu : టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు హోంమంత్రి సుచరిత కౌంటర్ ఇచ్చారు. అయ్యన్నపాత్రుడు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. సీఎం, మంత్రులు, మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని సుచరిత డిమాండ్ చేశారు.

దళిత మహిళనైన తనపై అయ్యన్నపాత్రుడు ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. సభ్యతా సంస్కారం లేని అయ్యన్నపాత్రుడు నుండి ఇంతకంటే మంచి మాటలు ఎందుకు వస్తాయన్నారు. తనపై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేయడం చాలా బాధ కలిగించాయని పేర్కొన్నారు. మహిళలపై అయ్యన్నపాత్రుడుకి ఎంత గౌరవం ఉందో తెలుస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలపై సమాజం కూడా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు.

Sucharita : దిశ చట్టాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ కార్యక్రమాలు : మంత్రి సుచరిత

వంగవీటి మోహన్ రంగా హత్య ఎవరు హోంమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందో అయ్యన్నపాత్రుడుకి తెలియదా అని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య జరిగింది మీరు అధికారంలో ఉన్నప్పుడు కాదా..? అని నిలదీశారు. తనకు పదవి ఇచ్చింది జగన్.. ఆయన చెప్తే ఈ క్షణం రాజీనామా చేస్తా.. మీరెవరు చెప్పడానికి అని మండిపడ్డారు. దళిత మహిళకు హోంమంత్రి పదవి వస్తే మీకెందుకు కడుపు మంటని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు లాంటి వారు రాజకీయాలకే అర్హుడు కాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

గంజాయి అమ్ముకునే అయ్యన్న నీతులు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న తనపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే సామాన్య మహిళల పట్ల ఎలాంటి గౌరవంతో ఉన్నారో అర్ధం అవుతుందన్నారు.

జోగి రమేష్ వెళ్ళింది నిరసన తెలియజేయడానికి.. ముట్టడికి కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతపై దాడికి వెళ్ళలేదు.. అయ్యన్నపై ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లారని తేల్చి చెప్పారు. టీడీపీ నేతలు ఆయనపై దాడికి దిగారు కనుకే పోలీసులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. సీఎం ఇల్లు ముట్టడిస్తాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు.. పోలీసులు చూస్తూ ఊరుకోరని చెప్పారు. పోలీసులు ఎక్కడ పక్షపాతంగా లేరు.. ఘటనపై విచారణ జరిపి కేసులు నమోదు చేశారని తెలిపారు.