విశాఖ స్టీల్ ప్లాంట్ ను మేమే తీసుకుంటాం

విశాఖ స్టీల్ ప్లాంట్ ను మేమే తీసుకుంటాం

Minister Gautam Reddy comments on Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీల వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ప్రభుత్వమే తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పారు.

ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ప్రభుత్వం తరపున ప్రపోజల్ వేస్తామన్నారు. ఉద్యమాల నుంచి స్టీల్ ఫ్యాక్టరీ పుట్టిందని..ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తే ప్రభుత్వం తరపున బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పారు. పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి ఏపీకి చాలా రావాల్సివుందని తెలిపారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పలు పార్టీలు, కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మె‍ల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాతే తన రాజీనామాకు ఆమోదం తెలపాలని కోరారు.

ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గంటా శ్రీనివాస్‌ శనివారం(ఫిబ్రవరి 6, 2021) లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు గంటా ప్రకటించారు. తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని గంటా తెలిపారు.