అందుకే పెంచాం : APSRTC ఛార్జీల బాదుడు

  • Published By: madhu ,Published On : December 8, 2019 / 01:16 AM IST
అందుకే పెంచాం : APSRTC ఛార్జీల బాదుడు

ఆర్టీసీని బతికించుకోవాలంటే ఛార్జీల భారం మోపక తప్పదు. రేట్లు పెంచే ముందు ప్రభుత్వాలు చెబుతున్న కారణాలివి. కారణాలు ఏమైనా గాని.. ఆ భారం ప్రజల నెత్తినే పడుతోంది. ధరలు ఎంతెంత పెరుగుతాయన్న దానిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. తెలంగాణలో కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచారు. కాని, ఏపీలో మాత్రం కాస్త ఊరటనిస్తూ పల్లెవెలుగులో కిలో మీటర్‌కు పది పైసలు మాత్రమే పెంచుతున్నారు.

ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందునే ఛార్జీలు పెంచుతున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. నష్టాలతో కొనసాగితే దివాళా తీయాల్సి ఉంటుందని, అందుకే ఛార్జీలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే రూ. 6 వేల 735 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. నెలకు వంద కోట్ల చొప్పున ఏటా రూ. 1200 కోట్ల నష్టం వస్తోందన్నారు. 
* పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు.
* మిగతా బస్సుల్లో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* ఎప్పట్నుంచి ఈ పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయనేది త్వరలోనే ప్రకటించనున్నారు.
* ఛార్జీల పెంపు అమలు తేదీని ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ విరుచుకుపడుతోంది. ప్రజలపై పైసా భారం వేయబోమని పాదయాత్రలో చెప్పిన జగన్.. 6 నెలల్లోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ప్రజలను మోసగించడమేనని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ చెప్పేదొకటి చేసేదొకటని మరోసారి రుజువైందన్నారు. ఏదేమైనా ఏపీలోనూ రెండు రోజుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెరగడం మాత్రం క్లియర్. 
Read More : డయల్ 100కు ఫోన్ చేసిన మహిళ : క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు