Andhra pradesh : రాజమండ్రిపై కన్నేసిన గోరంట్ల..బాబు అంగీకరిస్తారా? మరి సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ?

రాజమండ్రి సీటుపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కన్నేసారట..మరి చంద్రబాబు అంగీకరిస్తారా?బాబు అంగీకరిస్తే మరి సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ? అనే చర్చనడుస్తోంది టీడీపీలో.

Andhra pradesh : రాజమండ్రిపై కన్నేసిన గోరంట్ల..బాబు అంగీకరిస్తారా? మరి సిట్టింగ్ మహిళా ఎమ్మెల్యే పరిస్థితి ఏంటీ?

Andhra Pradesh Politics

Andhra pradesh politics : తెలుగుదేశంలో ఆయన సీనియర్ లీడర్. పార్టీపై ఈగ వాలినా.. ఓ రేంజ్‌లో ఫైర్ అవుతారు. అంతేకాదు.. అధినేత నిర్ణయాలు తప్పనిపిస్తే.. రివర్స్ ఎటాక్ కూడా చేస్తారు. అలాంటి సీనియర్.. ఇప్పుడు పక్క నియోజకవర్గంపై కన్నేశారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే.. అధినేత ముందు తన ప్రతిపాదన పెట్టబోతున్నారనే చర్చ నడుస్తోంది. అయితే.. ఈ పరిణామం చంద్రబాబు తలనొప్పి వ్యవహారమే అంటున్నారు. దీనిని.. బాబు గారు ఎలా డీల్ చేస్తారోనని.. తెలుగు తమ్ముళ్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గోరంత తేడా వచ్చినా.. ఊరంతా వినిపించేలా ఫైర్ అయిపోతారు. అది.. పార్టీలో అయినా. మరో రకంగా అయినా. రాజమండ్రి సిటీ నుంచి 4 సార్లు, రూరల్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. ఆయన మనసు మళ్లీ రాజమండ్రి సిటీ సెగ్మెంట్‌కు మీదలు మళ్లుతోందనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో.. సిటీ నుంచే పోటీ చేస్తానని.. సన్నిహితుల దగ్గర చెబుతున్నారు. 2014లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా.. రాజమండ్రి సిటీ బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూరల్‌కు మారారు. ఇప్పుడు.. మళ్లీ సిటీ మీద కన్నేశారు. ఇదే విషయాన్ని.. పార్టీ అధినేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, లోకేశ్ దగ్గర చెప్పేందుకు.. మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Also read : Andhra pradesh : మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ నిజంగానే కలిసిపోయారా? ఇదేం సినిమా కాదు అంటున్న నేతలు

ప్రస్తుతం.. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవాని ఉన్నారు. నగరంలో ఆదిరెడ్డి కుటుంబానికి గట్టి ప్టటుంది. భవాని భర్త వాసుకు.. లోకేశ్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. అందువల్ల.. పెద్దాయన కోరిక.. కచ్చితంగా అధినేత చంద్రబాబును ఇబ్బంది పెట్టే అంశమే అంటున్నారు పసుపుదళంలోని నేతలు. బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి సిటీ సీటు ఇవ్వాలంటే.. ఆదిరెడ్డి కుటుంబం ఒప్పుకోవాలి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానికి.. శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు రాంమోహన్ నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడైన బాబాయ్ అచ్చెన్నాయుడు అండ ఉంది. ఇక.. బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వర్గాల మధ్య విభేదాలు కూడా అందరికీ తెలిసినవే. ఇవి కూడా చంద్రబాబుకు, లోకేశ్‌కి తలనొప్పిగా మారాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. బుచ్చయ్య చౌదరి.. పార్టీకి ఎంత సీన్సియర్‌గా పనిచేస్తారో.. తేడాలొస్తే అదే స్థాయిలో రివర్స్ ఎటాక్ చేస్తారు. గతంలో.. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. పాలిటిక్స్‌కు గుడ్‌బై చెబుతానని.. చంద్రబాబుకే టెన్షన్ పుట్టించారు. కొందరు నేతలు జిల్లాలో పెత్తనాలు చేస్తున్నారని.. ఆయారాం.. గయారాం.. నాయకులను ప్ర్రోత్సహించొద్దని కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని.. అధినేతనే టార్గెట్ చేశారు. చివరికి.. పార్టీ నాయకత్వం, చంద్రబాబు బుజ్జగించడంలో.. బుచ్చయ్య మెత్తబడ్డారు. అయితే.. ఆదిరెడ్డి కుటుంబం టార్గెట్‌గానే ఈ వ్యాఖ్యలు చేశారని.. అప్పట్లో ప్రచారం జరిగింది.

Also read : దేశంలో కరోనా కలకలం.. టెన్ష‌న్ పెడుతున్నకేసులు

2014, 2019 ఎన్నికల నుంచి.. ఇవే నాకు చివరి ఎన్నికలంటూ వస్తున్న బుచ్చయ్య చౌదరి.. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీని కోరడం.. చంద్రబాబుకు షాకింగేనని.. టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి.. పసుపు దళపతి.. ఈ పంచాయతీని ఎలా సెటిల్ చేస్తారన్నది.. ఆసక్తిగా మారింది.