AP Covid Update : ఏపీలో కొత్తగా 495 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న రాష్ట్రంలో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య23,15,

AP Covid Update : ఏపీలో కొత్తగా 495 కోవిడ్ కేసులు

ap covid update

Updated On : February 18, 2022 / 6:49 PM IST

AP Covid Update : ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టింది. నిన్న రాష్ట్రంలో 22,383 శాంపిల్స్ పరీక్షించగా 495 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇంతవరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య23,15,525 కి చేరింది.

కోవిడ్ తదితర కారణాలతో నిన్న చిత్తూరులో ఒకరు మరణించటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో  కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,708కి చేరింది. గురువారం కోవిడ్‌కు చికిత్స పొంది 1,543 మంది కోలుకున్నారు.
Also Read : Telangana : కరోనా వ్యాక్సినేషన్..దేశంలోనే తెలంగాణ టాప్
దీంతో ఇప్పటి వరకు కోవిడ్ వచ్చి కోలుకున్న వారి సంఖ్య 22,92,396కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,421 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కోంది.