AP Corona : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

AP Corona : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. నిన్నటి (334) పోలిస్తే 100 కేసులు అధికంగా నమోదయ్యాయి.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 32వేల 785 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 434 మందికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది. గత నెల రోజుల్లో 200కు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. నిన్న 334 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లో అయిందా? ఈ సెట్టింగ్‌ మార్చుకోండి.. వేగం పెరుగుతుంది!

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,376కి పెరిగింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ తో ఒక్కరు కూడా చనిపోలేదు. రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,499గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 102 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,029 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,848 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో 434 కేసులు నమోదవగా.. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 68 కేసులు వెలుగుచూశాయి. విశాఖలో 63, కృష్ణా జిల్లాలో 61 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా 7 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.

Amazon Deal: 48MP స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందవచ్చు.. ఆఫర్ తెలుసుకోండి!

మరోవైపు ఒమిక్రాన్ వేరియంటో ఏపీపై పంజా విసురుతోంది. రాష్ట్రంలో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 28కి పెరిగింది.

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. మూడో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ ముఖ్య సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్‌ సాధారణ జలుబు లాంటి వ్యాధి కాదని, ఆరోగ్య వ్యవస్థలపై ఇది తీవ్ర ప్రభావం చూపించొచ్చని హెచ్చరించారు. కేసులు అకస్మాత్తుగా, భారీ సంఖ్యలో పెరుగుతున్నాయని గుర్తు చేశారు. పరీక్షలు చేయడం, రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్‌లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, వచ్చే రెండు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరొచ్చని అన్నారు.

కాగా, దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కొవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే అని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురవడమే ఇందుకు కారణం అన్నారు. దీనికి తోడు 90శాతం మంది అర్హులు వ్యాక్సిన్‌ తీసుకున్నారని, 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందిందని నిపుణులు వెల్లడించారు.