AP Corona : బిగ్ రిలీఫ్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆ 3 జిల్లాలో జీరో కోవిడ్

ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 100కి దిగువన కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.

AP Corona : బిగ్ రిలీఫ్.. ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఆ 3 జిల్లాలో జీరో కోవిడ్

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజువారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 100కి దిగువున కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.

Credit Debit Cards : క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్.. జనవరి నుంచి కొత్త రూల్స్

రాష్ట్రంలో ఇటీవల కాలంలో 100కి లోపు కరోనా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గడిచిన 24 గంటల్లో 21వేల 211 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 75 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో 17 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు వెల్లడయ్యాయి. కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మిగిలిన జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెలుగుచూశాయి.

Mustard Oil : అవనూనెతో వంట…బరువు తగ్గటం సులువు

అదే సమయంలో కరోనాతో ఒకరు చనిపోయారు. గుంటూరు జిల్లాలో ఒకరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,480కి పెరిగింది. గడిచిన 24గంటల్లో 154 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,59,882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో 1,517 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తగా ఉండాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.

కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.