AP Corona : ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కొవిడ్ తో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి

AP Corona : ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు

Ap Corona Cases

AP Corona : రాష్ట్రంలో గత 24 గంటల్లో 40వేల 350 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా, 540 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో 10 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 557 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,59,122. మొత్తం 20,38,248 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,286 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Honey : టీలో తేనె కలుపుకుంటున్నారా! ఏం జరుగుతుందో తెలుసా?

తాజాగా రెండు జిల్లాల్లో(చిత్తూరు, గుంటూరు) తప్ప మిగిలిన జిల్లాల్లో వందకంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. నాలుగు జిల్లాల్లో పదిలోపు కేసులు వెలుగుచూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. తాజా బులిటెన్ లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 120, గుంటూరు జిల్లాలో 111 కేసులు నమోదు కాగా… అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 10కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. ఇక, ఇప్పటివరకు 2,88,79,945 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Home Pollution : ముప్పుగా మారబోతున్న ఇంటి కాలుష్యం

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు..
అనంతపురం జిల్లాలో 07, చిత్తూరు జిల్లాలో 120, తూర్పుగోదావరి జిల్లాలో 73, గుంటూరు జిల్లాలో 111, కడప జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 04, నెల్లూరు జిల్లాలో 45, ప్రకాశం జిల్లాలో 27, శ్రీకాకుళం జిల్లాలో 03, విశాఖపట్నం జిల్లాలో 45, విజయనగరం జిల్లాలో 07, పశ్చిమగోదావరి జిల్లాలో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో వారం రోజుల క్రితం వెయ్యికి తగ్గని కేసులు గత కొన్ని రోజులుగా 500 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత రోజు 517 పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడా సంఖ్య పెరిగింది.