రెండు గ్రామాల మధ్య శ్మశానం గొడవ..ఊరు మధ్యలో శవాన్ని వదిలేసిపోయిన వైనం

రెండు గ్రామాల మధ్య శ్మశానం గొడవ..ఊరు మధ్యలో శవాన్ని వదిలేసిపోయిన వైనం

Cemetery dispute between two villages : శ్మశానాలు గ్రామ శివారుల్లో ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుతోంది. గ్రామాల్లో ఖాళీ స్థలాలు తగ్గిపోయాయి. దీంతో చాలా గ్రామాల్లో శ్మశానాల సమస్యలు వస్తున్నాయి. అటువంటి సమస్య వచ్చి ఓ వృద్ధురాలి అంత్యక్రియలు జరగకుండా నిలిచిపోయిన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

రెండు గ్రామాల మధ్య శ్మశానం విషయంలో వచ్చిన వివాదం రావటంతో ఓ వృద్ధురాలి అంత్యక్రియలు జరగకుండా నిలిచిపోయాయి. ఎంతకీ గొడవ సద్దుమణగపోవడంతో వృద్ధురాలి మృతదేహాన్ని ఊరి మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన విషాదం స్థానికంగా కలకలం సృష్టించింది.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మెట్టూరుగూడకు చెందిన రాయవలస మహలక్ష్మి అనే 65 ఏళ్ల మహిళ గురువారం (ఫిబ్రవరి 18)మృతి చెందింది. ఆమె మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు మెట్టూరు బిట్‌-3 నిర్వాసితకాలనీలోని శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కానీ చుట్టుపక్కల ఇళ్లున్నాయని..అంత్యక్రియలు జరపటానికి వీల్లేదని ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు.