Big Breaking : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపు

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 08:58 AM IST
Big Breaking : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లింపు

ఏపీలోని విద్యార్థులకు సీఎం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించడమే కాకుండా..3 త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా చెల్లించామని సీఎం జగన్ వెల్లడించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి బ్యాంకు అక్కౌంట్‌కే ఈ అమౌంట్ పంపిస్తామని, ప్రతి త్రైమాసికం పూర్తయిన తర్వాత నేరుగా తల్లి అక్కౌంట్‌లోకే జమ చేస్తామన్నారు. 2020, ఏప్రిల్ 14వ తేదీన మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. 

ఇంజినీరింగ్‌కు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద గత ప్రభుత్వం రూ.35 వేలు మాత్రమే ఇచ్చేదని, మిగిలిన డబ్బును కాలేజీలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేశాయని అధికారులు గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కాలేజీలకు ఇచ్చిందన్నారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన ఈ డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 

తదనుగుణంగా దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఆదేశాలు ఇచ్చామని, ఇవి సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు అందాయన్నారు. లేకపోతే…ఆదేశాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. 

Also Read | కరోనాను పాక్షిక సమస్యగా చూస్తోంది – జయప్రకాశ్ నారాయణ