అమ్మో.. ఆరడగుల శ్వేతనాగు.. చెమట్లు పట్టించింది..

సాధారణంగా పాముని చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. ప్రాణ భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. అలాంటిది.. అత్యంత విషపూరితమైన, ఆరడగుల శ్వేతనాగు కనిపిస్తే.. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ.

అమ్మో.. ఆరడగుల శ్వేతనాగు.. చెమట్లు పట్టించింది..

Snake

Big Snake : సాధారణంగా పాముని చూస్తేనే ఒళ్లంతా చెమట్లు పట్టేస్తాయి. ప్రాణ భయంతో గుండె వేగంగా కొట్టుకుంది. అలాంటిది.. అత్యంత విషపూరితమైన, ఆరడగుల శ్వేతనాగు కనిపిస్తే.. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులోని పెదపట్నం లంకలో అతి ప్రమాదకరమైన ఆరడుగుల శ్వేతనాగు స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. కొమ్ముల శంకరం అనే వ్యక్తి ఇంట్లోకి పాము వచ్చింది. ఇది గమనించిన శంకరం కుటుంబసభ్యులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు అప్పనపల్లికి చెందిన పాములు పట్టే యాళ్ల ప్రకాశరావుకి సమాచారం ఇచ్చారు.

అతను వచ్చే సరికి పాము ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి డొక్కల రాశుల్లోకి వెళ్లింది. ప్రకాశరావు దానిని ఎంతో చాకచక్యంగా బంధించాడు. ఊరి పొలి మేరలకు తీసుకెళ్లి విడిచిపెట్టాడు. ఇది అరుదైన శ్వేతజాతికి చెందిన తాచుపాము అని ప్రకాశరావు చెప్పాడు. దీని శరీరం తెలుపు రంగులో ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమైనదని తెలిపాడు. పాముని సేఫ్ గా బయటకు తీసుకెళ్లి వదిలేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.