MLC Madhav : మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే అభాసుపాలు కాక తప్పదు : ఎమ్మెల్సీ మాధవ్

శాసనమండలి సమావేశాలు బాగా జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. మండలిలో ప్రతిపక్షాలు కూడా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

MLC Madhav : మళ్లీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడితే అభాసుపాలు కాక తప్పదు : ఎమ్మెల్సీ మాధవ్

Mlc

AP Legislative Council : శాసనమండలి సమావేశాలు బాగా జరిగాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. మండలిలో ప్రతిపక్షాలు కూడా ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల బిల్లుకి ఇంకా ఫుల్ స్టాప్ పెడితే బాగుటుందని తెలిపారు. మళ్లీ బిల్లు పెడితే అభాసుపాలు కావడం తప్ప ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.

రాజధానిపై గతంలో ఉన్న పరిస్థితి తెస్తే బాగుంటుందన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవడం శుభపరిణామం అన్నారు. 8 రాష్ట్రాల్లో శాసన మండలి కొనసాగుతోందని తెలిపారు. 11వ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా ఇబ్బంది పెడుతుందని విమర్శించారు.

AP Assembly : 26 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం.. నిరవధిక వాయిదా

పీఆర్సీ పై ప్రభుత్వ వైఖరి సరైంది కాదని తెలిపారు. సీపీఎస్ అందని ద్రాక్ష లానే ఉందని వాపోయారు. వారం అన్నవారు రెండున్నర సంవత్సరాలు అయినా నోరు మెదపడం లేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అనేక విషయాల్లో ప్రభుత్వం చేతులు కాల్చుకుంటుందని చెప్పారు.

ప్రభుత్వానికి అవసరం అయినది ఏంటో, కానిది ఏంటో తెలుసుకోలేకపోతుందని విమర్శించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచడం, మటన్ షాప్ లు పెట్టడం వంటి అనవసర విషయాల ఫోకస్ తగ్గించుకోవాలని హితవుపలికారు.