Andhra Pradesh : పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ సూచనలపై కేంద్రం ఆలోచిస్తోంది : బీజేపీ ఎంపీ జీవీఎల్

ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. దీని కోసం బీజేపీ అధిష్టానంతో చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి ప్రధాన చర్చగా మారిన క్రమంలో బీజేపీ అధిష్టానం పవన్ కల్యాణ్ సూచనలపై ఫోకస్ పెట్టటం ఆసక్తికరంగా మారింది.

Andhra Pradesh : పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ సూచనలపై కేంద్రం ఆలోచిస్తోంది  :  బీజేపీ ఎంపీ జీవీఎల్

Pawan kalyan

BJP MP GVL : గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ నేతలతో పాటు ఎంపీ జీవీఎల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ పలు కీలక విషయాలు తెలిపారు. ముఖ్యంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు గురించి..మరి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన సూచనల గురించి బీజీపీ అధిష్టానం ఏమని యోచిస్తోందో వెల్లడించారు. పొత్తులపై బీజేపీ కార్యవర్గ భేటీలో చర్చించలేదని తెలిపిన జీవీఎల్‌ మా మిత్ర పక్షం జనసేనతో మా పొత్తు కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఎన్నికల సమయంలో ఎలా ‌వెళ్లాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని..మరి ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన సూచనలపై జాతీయ నాయకత్వం ఆలోచిస్తోందని తెలిపారు.

వైసీపీ పాలనపై ఏపీ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్‌ కార్యక్రమం చేపట్టింది. దీని గురించి జీవీఎల్ మాట్లాడుతు..ప్రజా చార్జ్‌షీట్లలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని..అవినీతి, అరాచక పాలనతో వైసీపీ విధ్వంసాన్ని చార్జ్‌షీట్ల ద్వారా వివరించామని తెలిపారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, నేతలపై ప్రజాభిప్రాయం సేకరించామని..వైసీపీ వైఫల్యాలను ఎత్తి‌చూపుతూ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేస్తామని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులిస్తోందని తెలిపారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని జీవీఎల్ వార్నింగ్ ఇచ్చారు.

Somu Veerraju : వైసీపీ పాలనపై ప్రజలు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు : సోము వీర్రాజు

కాగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని రాష్ట్రం సంక్షేమమే ముఖ్యమని దాని కోసం తాను పనిచేస్తానని వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పదే పదే చెబుతున్నారు. దీని కోసం పొత్తుల గురించి కూడా పవన్ నెట్వర్క్ చేస్తున్నారు. పొత్తుల గురించి ప్రధానంగా ఏపీలో చర్చ జరుగుతోంది. టీడీపీ,జనసేన పొత్తు ఖరారు అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఇరు పార్టీల అధినేతలు ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోయినా ప్రజల్లో మాత్రం వీరిద్దరి పొత్తు ఖరారు అనే అభిప్రాయం నాటుకుపోయింది. ఇక పోతే బీజేపీ పవన్ తో మా పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసింది. కానీ ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు లేకపోవటం జనసేనకు బీజేపీతో పెద్దగా ఒరిగేది లేదు ఓట్ల విషయంలో. కానీ బీజేపీ పవన్ దోస్తీ వెనుక పెద్ద విషయమే ఉంది. వైసీపీకి బీజేపీని దగ్గరకానివ్వకూడదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం బీజేపీ యత్నిస్తున్న క్రమంలో బీజేపీ దోస్తీ వల్ల తనకు మేలు జరుగకపోయినా వైసీపీతో మాత్రం బీజేపీ అధిష్టానం కలవకుండా చూడాలి. అదే పవన్ ప్లాన్.

మరోపక్క ఏపీ బీజేపీ నేతలు వైసీపీకి అనుకూలం అనే వార్తలు వస్తున్న క్రమంలో పవన్ బీజేపీ అధిష్టానంతో భేటీ కావటం..ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి వివరించటం వంటి కీలక అంశాలు జరుగుతున్నాయి. పవన్ అంటే బీజేపీ అగ్రనేతలకు గురి ఉంది. అది ఎంతగా అంటే ఏపీలో కొంతమంది బీజేపీ నేతలను నమ్మలేనంత అని సమాచారం.  ఎన్నికల సమయంలో వైసీపీ అరాచకాలకు పాల్పడుతుందని అదే బీజేపీ వైసీపీ కలిస్తే దానికి నియంత్రణ ఉండదని..అదే బీజేపీని తమతో పొ్త్తు ఉంటే వైసీపీ ఆగడాలు సాగవని పవన్ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ టీడీపీ,పవన్ కల్యాణ్ ను విమర్శిస్తుంది తప్ప బీజేపీపై విమర్శలు చేయదు.

కానీ బీజేపీకి ఏపీలో జనసేనకు ఉండే పాపులారిటీతో ఓటు బ్యాంకు పెంచుకోవాలని యోచిస్తోంది. కానీ టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటే తాము జనసేనతో పొత్తులో ఉండం అని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం వైసీపీని గద్దె దించాలంటే టీడీపీతో పొత్తు అవసరమనే అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీని కూడా ఒప్పించి పొత్తుతో కొనసాగాలని యోచిస్తున్నారు. అదే విషయాన్ని చెబుతున్నారు. ఈక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ అంటే బీజేపీ అధిష్టానినకి ఎంతటి గురి ఉందో అర్థమవుతోంది. ఏపీలో పొత్తుల గురించి..రాజకీయ పరిస్థితుల గురించి పవన్ కల్యాణ్ సూచనలను బీజేపీ జాతీయ వర్గం ఆలోచిస్తోంది అని చెప్పటం కీలకమనే చెప్పాలి.