Somu Veerraju : వైసీపీ పాలనపై ప్రజలు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు : సోము వీర్రాజు

వైసీపీ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్‌ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. ఛార్జిషీట్‌ సమావేశాల సమూహాన్ని పుస్తకరూపంలో తీసుకొస్తోంది. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని..ప్రతిచోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ ఆవేదన చెప్పారని సోము వీర్రాజు తెలిపారు.

Somu Veerraju : వైసీపీ పాలనపై ప్రజలు ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు : సోము వీర్రాజు

somu veerraju

BJP Leader Somu Veerraju : గన్నవరంలో సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దగ్గుబాటి పురంధేశ్వరి, సత్యకుమార్‌, జీవీఎల్‌, వాకాటి, మాధవ్‌, విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతు.. వైసీపీ పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ఛార్జిషీట్‌ కార్యక్రమం చేపట్టామని..ఈ ఛార్జిషీట్‌ సమావేశాల సమూహాన్ని పుస్తకరూపంలో తెస్తామని తెలిపారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని..ప్రతిచోటా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ ఆవేదన చెప్పారని తెలిపారు. 20 లక్షల ఇళ్లు నిర్మించాలని కేంద్రం నిధులు ఇస్తే దారి మళ్లించారని..20,107 మంది ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారని తెలిపారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకాన్ని పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం మాయ చేస్తోందని..రోడ్లకు కేంద్రం నిధులిస్తే.. తన బంధువులకు మంత్రి కాంట్రాక్ట్‌ ఇచ్చాడు అంటూ ఆరోపించారు. పేదలకు సెంటు భూమి పేరుతో వైసీపీ ప్రభుత్వం భూముల కొనుగోళ్లలో గోల్‌మాల్‌ చేసిందని విమర్శించారు.రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని..రైతులను మోసం చేస్తూ మిల్లర్లకు ప్రభుత్వం కొమ్ముకాస్తోంది అంటూ విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలను రైతు దోపిడీ కేంద్రాలుగా మార్చారంటూ మండిపడ్డారు.

మే 30తో ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి కావస్తుండటంతో ఏపీలో బీజేపీ కార్యక్రమాలు చేపట్టింది. దీంట్లో భాగంగా ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్బంగా సోము వీర్రాజు బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు. 15 రోజులపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది ఏపీ బీజేపీ. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై దశలవారీగా ఛార్జిషీట్లు విడుదల చేయనుంది.ఏపీలో బీజేపీ కార్యక్రమాలు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చలు జరుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు.