BJP Satyakumar : బీజేపీకి మూడు రాజధానుల సెగ.. జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై దాడి

మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే.. దళిత నాయకుడిని చంపేసే వారా? బలహీనవర్గానికి చెందిన నన్ను కూడా చంపేసే వాళ్లా?(BJP Satyakumar)

BJP Satyakumar : బీజేపీకి మూడు రాజధానుల సెగ.. జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై దాడి

BJP Satyakumar : బీజేపీకి మూడు రాజధానుల సెగ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ వాహనంపై దాడి జరిగింది. అమరావతి మందడంలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను.. మూడు రాజధానుల శిబిరం నిర్వాహకులు అడ్డుకున్నారు. అంతేకాదు.. సత్యకుమార్ వాహనంపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి అక్కడ విధ్వంసం సృష్టించారు. అయితే బీజేపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాజధాని అమరావతి కోసం ఆ ప్రాంత రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వారి పోరాటానికి 1200 రోజులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైతులకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ నేత సత్యకుమార్ వెళ్లారు. అయితే, అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది.(BJP Satyakumar)

Also Read..Visakhapatnam Lok Sabha Constituency : సాగరతీరంలో రాజకీయం గరంగరం…విశాఖ పార్లమెంట్‌ పరిధిలో పార్టీల వ్యూహాలేంటి ? వైసీపీని టీడీపీ క్లీన్‌బౌల్డ్ చేస్తుందా ?

రైతుల దీక్ష శిబిరం నుంచి సత్య కుమార్ తుళ్లూరులో బీజేపీ కార్యకర్తలను కలిసేందుకు వెళుతుండగా, ఉద్ధండరాయునిపాలెం దగ్గర ఆయన కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కారుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్.. వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు.

సీఎం జగన్ మూల్యం చెల్లించుకుంటారు:
ఈ దాడిపై సత్యకుమార్ స్పందించారు. తనపై దాడి పక్కా పథకం ప్రకారం జరిగిందన్నారు. తన కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా తమ వాళ్లనే పోలీసులు నెట్టేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై డీఎస్పీ సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. ఇలాంటి దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని సత్యకుమార్ హెచ్చరించారు.

”ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగింది. దాడి చేస్తుంటే పోలీసులు వారికి సపోర్ట్ చేశారు. దాడి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. మీది కడప అయితే మాది కూడా కడపే. బలహీనవర్గానికి చెందిన సత్యకుమార్ పై దాడి చేయండని తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చాయి.

Also Read..Razole: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతోన్న రాజోలు రాజకీయం.. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే..

కడప జిల్లాలో నా రాజకీయ ప్రత్యర్థి, నా అవినీతిని ప్రశ్నిస్తుంటాడు కాబట్టి ఆదినారాయణ రెడ్డిపై దాడి చేయండి అని పంపించినట్లుగా ఉంది. అనుకోకుండా జరిగిన దాడి కాదు. ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని ఎంపీ నందిగం సురేశ్ అన్నారు. అటే, ఆదినారాయణ రెడ్డి అక్కడే ఉంటే చంపేసేవారా? మా కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో లేకపోయి ఉంటే.. దళిత నాయకుడిని చంపేసే వారా? బలహీనవర్గానికి చెందిన నన్ను కూడా చంపేసే వాళ్లా?” అని సత్యకుమార్ అన్నారు.