Botsa Satyanarayana : మంత్రి పదవి దక్కినా హ్యాపీగా లేని బొత్స..కేటాయించిన విద్యాశాఖపై నచ్చలేదట..మరి ఇంకేం కావాలో..?!

మంత్రి పదవి దక్కినా హ్యాపీగా సత్యనారాయణ హ్యాపీగా లేరట....ఎందుకంటే కేటాయించిన విద్యాశాఖ ఆయనకు తగినది కాదటం..ఆయనకు తగిన ప్రాధాన్యత శాక కేటాయింపులో జరగలేదట..

Botsa Satyanarayana : మంత్రి పదవి దక్కినా హ్యాపీగా లేని బొత్స..కేటాయించిన విద్యాశాఖపై నచ్చలేదట..మరి ఇంకేం కావాలో..?!

Botsa Satyanarayana Unhappy Over The Allocation Of The Minister Of Education

Botsa Satyanarayana : కేబినెట్ బెర్త్‌ దక్కలేదని కొందరు ఏడుస్తుంటే.. మంత్రి పదవి వచ్చినా.. కొందరు అలుగుతున్నారు. తమకు కేటాయించిన శాఖకు ప్రాధాన్యత లేదని.. వాళ్లకు వాళ్లే అనుకొని.. తెగ ఫీలైపోతున్నారు. ఏదో ఓ శాఖ.. కేబినెట్‌లో ఉండి.. మంత్రి హోదా దక్కితే చాలనుకుంటున్న టైంలో.. ఆయన మాత్రం తనకు బెర్త్ దక్కినా ముభావంగానే ఉన్నారు. ఇప్పటివరకు.. తనకు కేటాయించిన శాఖ బాధ్యతలే తీసుకోలేదు. ఇంతకీ.. ఎవరా మంత్రి.. ఎందుకా.. అసంతృప్తి? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో.. కేబినెట్ బెర్త్‌లు దక్కక.. కొందరు మాజీ మంత్రులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. వారిని.. ఎలాగోలా బుజ్జగించి.. దారికి తెచ్చుకుంది అధిష్టానం. కానీ.. సీనియర్ కోటాలో మళ్లీ బెర్త్ దక్కించుకున్న బొత్స సత్యనారాయణ మాత్రం.. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.

Also read : Lokesh Purandewari : లోకేశ్‌కు ఫురంధేశ్వరి మద్దతు..నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా?
రెండు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయాలు చేస్తున్న బొత్స.. కేబినెట్ విస్తరణ తర్వాత.. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో హుందాగా వ్యవహరించిన ఆయన.. శాఖ కేటాయింపు తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఏమిటా అని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసి అంతా అవాక్కవుతున్నారు. ఆయనకు కేటాయించిన విద్యాశాఖపై.. బొత్స తెగ ఫీలైపోతున్నారని.. ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అటు.. వైసీపీ శ్రేణుల్లోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఆయనకు తగిన ప్రాధాన్యత కల్పించలేదనే వాదన వారి నుంచి వినిపిస్తోంది.

నిజానికి.. ప్రభుత్వంలో ప్రతి మంత్రిత్వ శాఖ కీలకమైనదే. దేని.. ప్రాధాన్యత దానికుంటుంది. బొత్సకు కేటాయించిన విద్యాశాఖ కూడా ముఖ్యమైనదే. కానీ.. బొత్స లాంటి మాస్ లీడర్‌కి.. గతంలో అనేక కీలక మంత్రిత్వ పదవులు చేపట్టిన నాయకుడికి.. ఈ శాఖ సరైంది కాదని.. వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నారు. ఇవన్నీ విన్నాక.. బొత్స కూడా వెంటనే అసంతృప్తి మోడ్‌లోకి వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది.

మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. మంత్రులంతా వేదికపైనే స్వామి భక్తిని చాటుకునేందుకు ప్రయత్నించారు. బొత్స మాత్రం ముందుగా గవర్నర్‌ దగ్గరికెళ్లి నమస్కారం చేశారు. ఆ తరువాత సీఎం జగన్‌ను కలిసి.. షేక్ హ్యాండ్‌తో సరిపెట్టారు. మిగిలిన మంత్రులతో పోలిస్తే.. కాస్త భిన్నంగా వ్యవహరించారు. బహుశా ఈ పరిణామమే.. సత్తిబాబు శాఖ కేటాయింపుపై ప్రభావం పడి ఉండొచ్చన్న టాక్ నడుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత.. మంత్రులంతా సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కానీ.. ఈ కార్యక్రమానికి బొత్స హాజరవలేదు. అలాగే.. అమరావతిలో విద్యాశాఖపై సీఎం రివ్యూ చేశారు. పదో తరగతి పరీక్షలతో పాటు వరుసగా వస్తున్న ఇతర పబ్లిక్ ఎగ్జామ్స్ పైనా చర్చించారు. కానీ.. ఈ రివ్యూకు కూడా శాఖ మంత్రిగా బొత్స హాజరుకాలేదు. ఈ పరిణామాలన్నింటికి.. బొత్సలో ఉన్న అసంతృప్తే కారణమని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Also read : Hindu Temple under Mosque: మసీదు నిర్మాణ సమయంలో బయటపడ్డ హిందూ ఆలయ శిధిలాలు: రంగంలోకి వి.హెచ్.పి

అయితే.. మంత్రి బొత్స తన సోదరుడు లక్ష్మణరావు కుమార్తె వివాహ వేడుకల ఏర్పాట్లలో ఉండటం వల్లే.. సీఎంను కలవలేకపోయారని, విద్యాశాఖపై రివ్యూకు హాజరవలేకపోయారని.. ఈ విషయం సీఎంకు కూడా విన్నవించారని.. ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయ్. ఇదిలా ఉంటే.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారి సొంత జిల్లాకు వస్తున్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కనీసం.. అధికారిక సమాచారం కూడా లేదు. కట్ చేస్తే.. ఇదే నెలలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కనిపించారు. జిల్లాకు వస్తున్నట్లు సమాచారం గానీ.. స్వాగత ఏర్పాట్లు గానీ.. ఎలాంటి హంగామా గానీ లేకపోవడం.. జిల్లాలో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఇప్పటి వరకు తనకి కేటాయించిన విద్యా శాఖకు సంబంధించి బాధ్యతలు తీసుకోకపోవడంపైనా చర్చ నడుస్తోంది. తనకి ఇష్టమైన శాఖ కేటాయించకపోవడం వల్లే.. సత్తిబాబు అలిగారన్న టాక్ వినిపిస్తోంది.

Also read : Andra pradesh : క్యాసినో స్టార్ కొడాలి నాని విశ్వరూపం అంటే అధికారులపై దాడులు చేయించటమా :నారా లోకేశ్

ఒకప్పటి కాంగ్రెస్ సర్కారులో సత్తిబాబుకున్న ఫ్రీ హ్యాండ్.. జగన్ ప్రభుత్వంలో లేనప్పటికీ.. మంత్రివర్గ విస్తరణలో.. మళ్లీ తన బెర్త్ నిలబెట్టుకున్నారు. కానీ.. ఏం లాభం.. మాస్ లీడర్ అయిన బొత్సకు.. జనాలతో నేరుగా సంబంధం లేని.. విద్యాశాఖను కేటాయించారు. దీంతో.. ఆయన తనకు సరిపోలిన శాఖను ఇవ్వలేదని తెగ ఫీలైపోతున్నారు.