Lokesh Purandewari : లోకేశ్‌కు ఫురంధేశ్వరి మద్దతు..నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా?

లోకేశ్‌కు ఫురంధేశ్వరి మద్దతునిస్తున్నట్టు 10టీవీ వేదికంగా పురంధేశ్వరి తెలిపారు. ఈ వ్యాఖ్యలు నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా అనిపించేలా ఉన్నాయి.

Lokesh Purandewari : లోకేశ్‌కు ఫురంధేశ్వరి మద్దతు..నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా?

Lokesh Purandewari

Lokesh Purandewari : చినబాబు లోకేశ్‌కు.. పెద్దమ్మ మద్దతివ్వడం.. తెలుగుదేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ఉప్పూ-నిప్పులా ఉండే ఆ రెండు కుటుంబాలు.. మళ్లీ దగ్గరవుతుండటం.. తమ్ముళ్లలో ఉత్సాహం నింపుతోంది. పేరుకు.. తోడల్లుళ్లయినా.. దశాబ్దకాలంగా మాటలు, చూపులు లేక.. విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి.. ఇన్నాళ్లూ లేనిది.. ఆ రెండు కుటుంబాలు ఇప్పుడెందుకు దగ్గరవుతున్నాయ్? ఈ మార్పు.. రాజకీయంగా దేనికి సంకేతం?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేశ్‌ని ఉద్దేశించి.. టెన్ టీవీ వేదికగా.. దగ్గుబాటి ఫురంధేశ్వరి చేసిన కామెంట్స్.. ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి.. ఈ మధ్యకాలంలో దగ్గరవుతున్న నారా, దగ్గుబాటి కుటుంబాలు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాయ్. నా సోదరి కుమారుడైన లోకేశ్‌కి.. సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని. పురంధేశ్వరి ప్రకటించడం.. టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

Also read : Andhra pradesh: గుడివాడలో మట్టిమాఫియా బరితెగింపు.. ఆర్ఐ‌పై దాడి.. ఘటన స్థలిని పరిశీలించిన టీడీపీ నేతలు

సుదీర్ఘకాలం.. ఎడమొహం-పెడమొహంగా ఉన్న చంద్రబాబు, ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు.. గతేడాది ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుకలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి దగ్గుబాటికి, చంద్రబాబుకు మధ్య విభేదాలుండేవి. టీడీపీ నాయకులు సైతం.. రెండు వర్గాలుగా విడిపోయారు. అనేక సందర్భాల్లో.. ఏ అల్లుడికి సపోర్ట్ చేయాలో తెలియక.. ఎన్టీఆర్ కూడా సతమతమయ్యేవారు. రాజకీయంగా మొదలైన ఈ వైరం.. తరువాత కుటుంబ బంధాలను కూడా దూరం చేసింది. దాంతో.. రెండు కుటుంబాల మధ్య కిలోమీటర్ల కొద్దీ గ్యాప్ పెరిగిపోయింది. రాజకీయంగా విడిపోయిన వీరు.. కుటుంబపరంగానూ కలవని స్థాయికి విభేదాలుచేరుకున్నారు. ఈ దూరం ఎఫెక్ట్.. పిల్లలపైనా పడేది.

ఎన్టీఆర్ మనవరాలి పెళ్లి వేడుక తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో.. భువనేశ్వరిని అవమానించారంటూ.. చంద్రబాబు బాధపడటం, కుటుంబసభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి అండగా నిలబడటం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో.. ఓ కుటుంబానికి మరో కుటుంబం మద్దతు ప్రకటిస్తూ రావడం, రాజకీయాలకు అతీతంగా.. కష్టనష్టాల్లో వెన్నుదన్నుగా నిలుస్తుండటం లాంటి పరిణామాలు.. వారి మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరుస్తూ వచ్చాయ్.

Also read : Telangana : తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు..ఫ్యూచర్ కోసం సమ్మర్ హాలీడేస్‌ నేతల ప్లాన్స్

పురంధేశ్వరి కూడా తన సోదరికి తీవ్ర అవమానం జరిగిందంటూ.. గట్టిగా మాట్లాడారు. తాజాగా 10టీవీకి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోనూ నారా కుటుంబం పట్ల తనకున్న సానుకూలతను బలంగా చాటారు. చంద్రబాబు తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టే నాయకుడు ఎవరంటూ తరచూ అంతర్గతంగా పార్టీ వర్గాల్లోనే జరిగే చర్చకు.. పురంధేశ్వరి చేసిన కామెంట్స్ చెక్ పెట్టినట్లైంది. నందమూరి, దగ్గుబాటి కుటుంబాల నుంచి లోకేశ్‌కు పూర్తి మద్దతు లభించినట్లైందని.. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చినబాబుకు పెద్దమ్మ దీవెనలు లభించటం గొప్ప పరిణామం అంటున్నారు.

గతంలా చాలా సందర్భాల్లో.. చంద్రబాబుపై.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. విమర్శలు చేశారు. కుటుంబ వేడుకలకు హాజరైనా.. ఒకరికొకరు ఎదురుపడకుండా.. జాగ్రత్త పడేవారని.. మరో టాక్. ఇది.. లోకేశ్, హితేశ్ చెంచురామ్‌ల స్నేహంపైనా.. ఎంతో కొంత ప్రభావం చూపేది. అలాంటి కుటుంబాలు ఇప్పుడు.. ఒకే మాటపై కలిసికట్టుగా ఉండటంపై.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు.. కొత్తగా.. దగ్గుబాటి వారసుడు హితేస్ .. తెలుగుదేశంలో చేరబోతున్నారంటూ మరో చర్చ సాగుతోంది. రాజకీయంగా.. రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి.. పరస్పరం గౌరవించుకుంటూ.. ఎవరి రాజకీయం వారు చేసుకోవాలనుకునే రీతిలో.. ప్రస్తుత పరిణామాలు సాగుతుండటం.. తెలుగుదేశం కేడర్‌లో కొత్త జోష్ నింపుతోంది.