Bride Srujana Postmortem : బలవంతం లేదు, ఎఫైర్ లేదు.. సృజన ఇష్టంతోనే పెళ్లి ఏర్పాట్లు
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టం చేశారు.(Bride Srujana Postmortem)

Bride Srujana Postmortem : విశాఖ మధురవాడలో నవవధువు సృజన పెళ్లిపీటలపైనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా, సృజన మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. డీటైల్డ్ పోస్టుమార్టం రిపోర్ట్స్ కావాలని పోలీసులు కోరారు. మరోవైపు సృజన హఠాన్మరణంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయని, సృజన ఇష్టంతోనే పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు బంధువులు చెబుతున్నారు.
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని బంధువులు స్పష్టం చేశారు. సృజనకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో చూపిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు సృజన ప్రాథమిక చికిత్స రిపోర్ట్ లో మాత్రం ఆమె శరీరంలో మోతాదుకు మించి విష పదార్దాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు సృజన గన్నేరు పప్పు తీసుకున్నట్లు ఆసుపత్రి రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. అలాగే, సృజన హ్యాండ్ బ్యాగ్ లోనూ గన్నేరుపప్పు అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో సృజన సెల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు.(Bride Srujana Postmortem)
మరోవైపు సృజన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పెళ్లిపీటలపైనే స్పృహ కోల్పోయి, కాసేపటికే కన్నుమూసిన సృజనకు కన్నీటి వీడ్కోలు పలికారు బంధువులు. పోస్టుమార్టం తర్వాత సృజన మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు వైద్యులు. మృతదేహాన్ని మధురవాడలో సృజన ఇంటికి తరలించారు.
Bride Death: జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి పీటలపైనే పెళ్లి కూతురు హఠాన్మరణం
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే కుప్పకూలింది. ఆ వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటన సంచలనంగా మారింది. నవవధువు మృతి కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పీటల మీదనే కుప్పకూలిన సృజనను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు.
కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి.. పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు.. తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందింది.
తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. వివాహానికి నెలసరి (బహిష్టు) అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఓ ట్యాబ్ లెట్ ఇచ్చారని, అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు. అయితే, సమయం గడిచేకొద్దీ ఈ కేసులో షాక్ కి గురి చేసే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
- Russia-Ukraine War : యుక్రెయిన్-రష్యా శాంతి చర్చల్లో వారిపై విష ప్రయోగం… నిజమేనంటున్న నివేదికలు..!
- Crime News : నల్గొండ జిల్లాలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. తండ్రి ఆత్మహత్య
- Visakha Road Accident: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- Amazon Poison : అమెజాన్లో అమ్మకానికి విషం… బాలుడు ఆత్మహత్య.. మరో వివాదంలో E-కామర్స్ దిగ్గజం
- Minor Girl: పోలీసుల ఎంక్వైరీలో టార్చర్.. విషం తాగిన మైనర్ బాలిక
1Bald Head Drug : బట్టతల ఉన్నవారికి ఎగిరి గంతేసే గుడ్న్యూస్..!
2Indian Hockey : అద్భుత విజయంతో సూపర్-4లో హాకీ టీమిండియా
3Telangana Corona News Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్
5Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
6KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
7Yoga Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. 200దేశాల్లో యోగా మహోత్సవం
8Yoga Mahotsav : రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్
9Mamata Banerjee: యూనివర్సిటీ ఛాన్స్లర్గా సీఎం.. బెంగాల్లో కొత్త చట్టం
10Shikhar Dhawan: నేల మీద దొర్లుతూ తండ్రి చేతిలో దెబ్బలు తింటున్న ధావన్
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Dental Care : ఇంట్లో లభించే పదార్ధాలతో నోటి,దంత సంరక్షణ ఎలాగంటే!
-
CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!