Bride Srujana Incident Update : పెళ్లిపీటలపై నవవధువు మృతి కేసులో మరో ట్విస్ట్.. సృజన బ్యాగ్‎లో గన్నేరు పప్పు..?

సృజన హ్యాండ్ బ్యాగ్ లో పప్పు లాంటి పదార్ధాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి పీటలు ఎక్కే ముందే పెళ్లి కూతురు సృజన ఆ పప్పును తినిందా? అనేది మిస్టరీగా మారింది.(Bride Srujana Incident Update)

Bride Srujana Incident Update : పెళ్లిపీటలపై నవవధువు మృతి కేసులో మరో ట్విస్ట్.. సృజన బ్యాగ్‎లో గన్నేరు పప్పు..?

Bride Srujana Incident Udadate

Bride Srujana Incident Update : విశాఖలో నవవధువు మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు సృజన హ్యాండ్ బ్యాగ్ లో పప్పు లాంటి పదార్ధాన్ని పోలీసులు గుర్తించారు. అది గన్నేరు పప్పుగా అనుమానం వ్యక్తమవుతోంది. పెళ్లి పీటలు ఎక్కే ముందే పెళ్లి కూతురు సృజన ఆ పప్పును తినిందా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. కాగా, సృజన మృతిపై ఇప్పటివరకు రెండు కుటుంబాలు పెదవి విప్పలేదు. అటు కేజీహెచ్ మార్చురీలోనే సృజన డెడ్ బాడీ ఉంది. కుటుంబసభ్యులు రాకపోవడంతో డాక్టర్లు పోస్టుమార్టం చెయ్యలేదు.

పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే కుప్పకూలింది. ఆ వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటన సంచలనంగా మారింది. నవవధువు మృతి కేసులో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పీటల మీదనే కుప్పకూలిన సృజనను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు.(Bride Srujana Incident Update)

Bride Death: జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి పీటలపైనే పెళ్లి కూతురు హఠాన్మరణం

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి.. పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు.. తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టే సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందింది.

Bride Death : పెళ్లిపీటల మీద వధువు మృతి కేసులో ట్విస్ట్..సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ

తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు. బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. వివాహానికి నెలసరి (బహిష్టు) అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఓ ట్యాబ్ లెట్ ఇచ్చారని, అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు. అయితే, సమయం గడిచేకొద్దీ ఈ కేసులు షాక్ కి గురి చేసే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పెళ్లిపీటలపై నవవధువు మృతి కేసు సంచలనంగా మారింది. ఈ కేసు మిస్టరీగా మారింది. మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంతోషాలు వెల్లవిరియాల్సిన పెళ్లి వేడుకలో విషాదం అలుముకుంది. నవవధువు మృతి అందరినీ షాక్ కి గురి చేసింది. సృజన మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.