Bride Death : పెళ్లిపీటల మీద వధువు మృతి కేసులో ట్విస్ట్..సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ

పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి..ఆ తరువాత వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటనలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Bride Death : పెళ్లిపీటల మీద వధువు మృతి కేసులో ట్విస్ట్..సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ

Twist In The Case Of Visakhapatnam Bride Died

Twist in the case of Visakhapatnam bride died : పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి..ఆ తరువాత వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో గురువారం (మే12,2022) జరిగిన ఈ విషాద ఘటనలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నవ వధువు సృజన శరీరంలో విషపదార్థం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. పీటలమీదనే కుప్పకూలిన సృజనను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది అని డాక్టర్లు నిర్దారించారు. సృజన మృతదేహానికి కేజిహెచ్ లో పోస్ట్ మార్టం నిర్వహించగా ఆమె శరీరంలో విషపదార్ధాలు ఉన్నట్లుగా తేలింది.

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని భావించిన ఆ పెళ్లి కూతురుకి..పీటలపైనే నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి ఆనంద బాష్పాలు కార్చిన ఆ తల్లిదండ్రులకు..తీరని దుఃఖం మిగిలింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి, అనంతరం మృతి చెందింది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ వివాహం సృజనతో నిశ్చయించారు పెద్దలు.

Also read : Bride Death: జీలకర్రబెల్లం పెడుతుండగా పెళ్లి పీటలపైనే పెళ్లి కూతురు హఠాన్మరణం

బుధవారం సాయంత్రం 7 గంటలకు వివాహ ముహూర్తం కాగా, సరిగా ముహూర్తం సమయానికి జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు సృజన పెళ్లి పీటలపైనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది అని డాక్టర్లు తెలిపారు.  వివాహానికి నెలసరి (బహిష్టు) అడ్డం వస్తుందని సృజనకు వారి తల్లిదండ్రులు ఓ ట్యాబ్ లైట్ ఇచ్చారని అది వికటించి చనిపోయి ఉంటుందని సృజన బంధువులు చెబుతున్నారు.

ఈ కేసు విషయంలో మధురవాడ సీఐ రవికుమార్ మాట్లాడుతూ..వధువు సృజన ఉదయం 8:30 కి మృతి చెందినట్లుగా ఆస్పత్రి డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు.సృజన మరణానికి కారణం పాయిజన్ తీసుకున్నట్లుగా డాక్టర్లు చెబుతున్నారని..పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తరువాత ఏ విషయం తెలుస్తుంది అని పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్ 174 ప్రకారం కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.