Buddha Venkanna : గుడివాడ వెళ్లకుండా అడ్డుకోవటానికి అదేమైనా పాకిస్తానా? బుద్ధా వెంకన్న

జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

Buddha Venkanna : గుడివాడ వెళ్లకుండా అడ్డుకోవటానికి అదేమైనా పాకిస్తానా? బుద్ధా వెంకన్న

Buddha Venkanna

Buddha Venkanna : గుడివాడ కాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కాసినో మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సై అంటే సై అంటున్నారు వైసీపీ, టీడీపీ నాయకులు. తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరోసారి మంత్రి కొడాలి నానిపై నిప్పులు చెరిగారు.

1991లో నెలకు రూ.1.15 లక్షల అద్దె కట్టి నేను కొబ్బరికాయల వ్యాపారం చేశానని బుద్ధా వెంకన్న చెప్పారు. ఆ సమయంలో కొడాలి నాని ఆగి ఉన్న వాహనాల్లో ఆయిల్ దొంగతనం చేసేవాడని అన్నారు. చంద్రబాబుకి, కొడాలి నానికి ఒకేసారి కరోనా వస్తే… ఉండవల్లిలోని తన నివాసంలోనే చంద్రబాబు హోం ఐసొలేషన్ లో ఉండి కోలుకున్నారని చెప్పారు. కరోనా సోకగానే చికిత్స కోసం పక్క రాష్ట్రంలో ఆసుపత్రికి పారిపోయిన కొడాలి నాని చంద్రబాబు ఆరోగ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

Night Food : రాత్రి సమయంలో ఆ ఆహారం తింటే షుగర్ , గుండె జబ్బులు వచ్చే చాన్స్!..

మద పిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి పట్టిన కొడాలి నాని.. జగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు. అలాంటి కొడాలి నానికి అతని భాషలోనే సమాధానం చెప్పాలన్నారు. కొడాలి నాని పిచ్చి కుదర్చటానికే తాను ఇలా మాట్లాడుతున్నా అని చెప్పారు. మంత్రి కొడాలి నాని వాడిన భాషపై అభ్యంతరం తెలుపుతూ విజయవాడ వన్ టౌన్ లో కేసు పెట్టినా ఇంతవరకు అక్ నాల్డెజ్ మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. నా పై కేసు పెట్టి విచారించినట్లే కొడాలి నాని పై కేసు పెట్టి విచారించాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవటానికి గుడివాడ ఏమైనా పాకిస్తానా? అని ప్రశ్నించారు బుద్ధా వెంకన్న.

Sanitizers : శానిటైజర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు.. ముఖ్యంగా మహిళలు, పిల్లలు..

గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని, డీజీపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి వరకు విచారించారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై సోమవారం రాత్రి 11.15 గంటలకు బుద్ధా వెంకన్నను పోలీసులు విడుదల చేశారు.