లంచం తీసుకున్న ఆఫీసర్‌ని పట్టించిన సీసీ కెమెరా

లంచం తీసుకున్న ఆఫీసర్‌ని పట్టించిన సీసీ కెమెరా

CCTV camera captures bribe-taking officer : అవినీతి ఆర్జనకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు లంచం తీసుకుంటుంగా చూశాం. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుబడటం చూశాం, విన్నాం కూడా. కానీ లంచం తీసుకుంటున్న అధికారిని సీసీ కెమెరానే పట్టించిన వైనం శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో జరిగింది. ఆమె లంచగొండి భాగోతాన్ని సీసీఫుటేజ్ బట్టబయలు చేసింది.

శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోన్న కుసుమ కుమారి.. ఓ కర్మాగారం తనిఖీల ధృవీకరణ కోసం అనుమతి ఇచ్చేందుకు యాజమాని వద్ద లంచం తీసుకుంది. అంతలోనే ఆమెకు ఆఫీసులో సీసీ కెమెరాలున్న సంగతి గుర్తుకు వచ్చినట్లుంది.

కానీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న ధీమాతో కుసుమ కుమారి నిర్లక్ష్యం వహించి, ఏకంగా సీసీ కెమెరాకే లంచం తీసుకున్న డబ్బు చూపిస్తూ ఎక్కిరించారు. చివరికి లంచగొండ బాగోతం సీసీ కెమెరాలో బట్టబయలైంది. సీసీఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన కర్మాగారాల డైరెక్టర్‌ ఆఫీసర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.