Tirupati : విలీనం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు!

దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.

Tirupati : విలీనం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు!

Tpt

Tirupati Airport : నష్టాల బాటలో ఉన్నాయనే…దానితో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అయితే..ప్రైవేకరించకుండా..ప్రత్యామ్నాయమార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయాలని భావిస్తోందని సమాచారం. అందులో భాగంగా…ఎయిర్ పోర్టుల ప్రైవేటేజేషన్ ప్రక్రియలో తొలిసారి మేజర్ ఎయిర్ పోర్టులతో చిన్న ఎయిర్ పోర్టులను కలుపుతున్నారు. దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది.

Read More : JioPhone Next : చౌకైన ధరకే జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్!

వారణాసి, తిరుచ్చి, ఇండోర్, భువనేశ్వర్, అమృత్ సర్, రాయ్ పూర్, జార్సుగూడ, తిరుపతి, జాల్గావ్, గయ, ఖుషీనగర్, కాంగ్రా, జబల్ పూర్ లాంటి చిన్న ఎయిర్ పోర్టులున్నాయి. తొలిసారి మేజర్ ఎయిర్ పోర్టులతో చిన్న ఎయిర్ పోర్టులను కలుపుతున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనుండగా..జార్సుగూడను భువనేశ్వర్ తో, ఖుషీనగర్, గయ ఎయిర్ పోర్టులను వారణాసితో, కాంగ్రాను రాయ్ పూర్ తో, అమృత్ సర్ ను జబల్ పూర్ తో క్లబ్ చేయనున్నారు.

Read More :Ford Motor: భారత్‌లో ఉత్పత్తి నిలిపేసిన ఫోర్డ్.. కారు కావాలంటే ఇక దిగుమతే!

2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఎయిర్ పోర్టులలో రూ. 3 వేల 660 కోట్ల ప్రైవేటు పెట్టుబడులును లక్ష్యంగా పెట్టుకుంది. 13 ఎయిర్ పోర్టులలో ఆరు మేజర్ ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయి. ఒక బిడ్ డ్యాక్యుమెంట్ ను సిద్ధం చేయడానికి ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా..ఓ కన్సల్టెంట్ ను నియమించింది. వచ్చే ఏడాది ఆరంభంలో బిడ్స్ ను కూడా ఆహ్వానించనుంది.