కరోనాపై పోరుకు రూ.20 కోట్ల భారీ విరాళం అందించిన రామోజీరావు

కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 01:05 AM IST
కరోనాపై పోరుకు రూ.20 కోట్ల భారీ విరాళం అందించిన రామోజీరావు

కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.

కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు. ఈ విరాళాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు అందించారు. మంగళవారం (మార్చి 31, 2020) ఆన్‌లైన్‌లో డబ్బును బదిలీచేశారు.

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 కరోనా కేసుల్లో 18 కేసుల్లో మర్కజ్‌ సదస్సుకు వెళ్లివచ్చినవారే ఉన్నారు. 

విశాఖలో మంగళవారం ఒక్కరోజే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు మర్కజ్‌ సదస్సులో పాల్గొన్నవారిగా గుర్తించారు. ఈ మేరకు మంగళవారం (మార్చి 31, 2020) రాష్ట్ర నోడల్‌ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత మొత్తం 256 శాంపిళ్లను పరీక్షించగా 21 కరోనా పాజిటివ్‌, 235 కరోనా నెగిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు కోలుకున్నట్టు చెప్పారు.

తెలంగాణలో కరోనా కలవరం రేపుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు. మృతులంతా ఈనెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడే వీరికి కరోనా వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది. అయితే వీరంతా తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా చనిపోయారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న ఇద్దరు గాంధీలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. 

మరొకరు అపోలో ఆస్పత్రిలో, ఇంకొకరు గ్లోబల్‌ ఆస్పత్రిలో చనిపోయారు. అంతేకాదు.. నిజామాబాద్‌, గద్వాలలోనూ ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే వీరందరూ… కరోనా సోకిందని తెలియకముందే చనిపోయారు. మూడు రోజుల క్రితం ఖైరతాబాద్‌లో కరోనాతో చనిపోయిన వృద్ధుడు కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఖైరతాబాద్‌ వృద్ధుడికి కూడా చనిపోయే ముందు కరోనా ఉన్నట్టు తెలియలేదు. ఆ తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. మిగతా వారు కూడా అదే రీతిలో చనిపోయినట్లు తెలుస్తోంది.

Also Read | నిజాముద్దీన్ ఈవెంట్ తర్వాత ఢిల్లీ, ఆంధ్రాలో 35 మందికిపైగా కరోనా.. తెలంగాణ నుండి 1,000 మందికి పైగా హాజరు