Challa’s Family: చల్లా కుటుంబంలో రచ్చకెక్కిన విభేదాలు.. వారసత్వ పోరు

దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణా రెడ్డి వారసత్వం కోసం పోరు కొనసాగుతోంది. ఆయన రాజకీయ వారసులం తామేనని కుటుంబ సభ్యులు ఘర్షణలకు దిగుతున్నారు.

Challa’s Family: చల్లా కుటుంబంలో రచ్చకెక్కిన విభేదాలు.. వారసత్వ పోరు

Challa's Family

Challa’s Family: దివంగత వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కాయి. చల్లా రామకృష్ణా రెడ్డి కుమారుడు, వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(46) కూడా నాలుగు నెలల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. వారి కుటుంబంలోనే కొన్ని వారాలుగా వివాదాలు తలెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి చిత్రపటం కోసం కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగారు.

చల్లా రాజకీయ వారసత్వం కోసం గత కొంత కాలంగా దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి అవుకు జడ్పీటీసీ శ్రీలక్ష్మి, చల్లా పెద్ద కుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డికి మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. విబేధాలపై గతంలో సీఎం జగన్ ను కలిశారు చల్లా శ్రీలక్ష్మి. అవుకులో చల్లా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చల్లా కుటుంబంలో ఆధిపత్యం కోసమే వివాదం రాజుకుంది.

చల్లా వారసులుగా మేమంటే మేమని కుటుంబంలో వారు పదేపదే గొడవ పడుతున్నారు. శ్రీలక్ష్మి, విఘ్నేశ్వర్ రెడ్డికి
మధ్య రాజకీయ గొడవలే కాకుండా ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు సమాచారం. తన కార్యాలయానికి వచ్చి చల్లా రామకృష్ణ రెడ్డి చిత్రపటాన్ని తీసుకువెళ్లారని చల్లా శ్రీలక్ష్మి చెబుతున్నారు. అంతేగాక, తనపై విజ్ఞేశ్వరరెడ్డి దాడికి దిగారని కూడా శ్రీలక్ష్మి ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని చల్లా శ్రీలక్ష్మి అంటున్నారు.

Renuka Chaudhary : ప్రధాని, కేంద్రమంత్రిపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు