Chandrababu: చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేత దారుణ హత్య తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

Chandrababu: చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు

Chandrababu (1)

Chandrababu: గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేత దారుణ హత్య తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. వెల్దుర్తి గుండ్లపాడుకు చేరుకుని మృతుడు చంద్రయ్యను నడిరోడ్డుపై హత్యచేయగా.. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు చంద్రబాబు. చంద్రయ్య ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. తర్వాత చంద్రయ్య పాడే మోసి కార్యకర్తల్లో ధైర్యం నింపారు.

చంద్రయ్య కుటుంబసభ్యులను ఓదార్చి పార్టీ తరఫున చంద్రయ్య కుటుంబానికి 25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. చంద్రయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు. పిన్నెల్లి సామ్రాజ్యంలో ప్రజాస్వామ్య స్థాపనకు వచ్చానంటూ ఈ సంధర్భంగా వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.

Corona India : భారత్ లో విజృంభిస్తున్న కరోనా.. 2.62 లక్షలకు చేరిన రోజువారీ కేసులు

చంద్రయ్యను చంపినవారికి శిక్ష పడాలని డిమాండ్ చేసిన ఆయన.. ఒక్క చంద్రయ్యను చంపితే.. వందల మంది చంద్రయ్యలు తయారవుతారని స్పష్టం చేశారు. చంద్రయ్య హత్యపై సీఎం వైఎస్.జగన్ సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు చంద్రయ్య హత్యతో వైసీపీకి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి.

గ్రామంలో రెండు వర్గాల మధ్య కక్షలే హత్యకు దారి తీశాయని.. తానేప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదన్నారు. నిందితులు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షించాలని కోరారు. టీడీపీ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని, మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, నిందితులు ఇంకా దొరకలేదన్నారు.