Chandrababu Tears : ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు..త్వరలో రూట్ మ్యాప్ ?

మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసిన చంద్రబాబు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Chandrababu Tears : ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు..త్వరలో రూట్ మ్యాప్ ?

Chandrababu Naidu Wont Return To Andhra Assembly Till Hes Back In Power

Chandrababu Naidu : మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేసిన చంద్రబాబు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 2021, 22వ తేదీ సోమవారం టీడీపీ సీనియర్‌ నేతలతో సమావేశం కానున్నారు చంద్రబాబు.ప్రజా ఉద్యమాల కోసం రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు సతీమణిపై వైసీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు టీడీపీ నేతలు. మహిళలను వ్యక్తిగతంగా దూషించడం తగదన్నారు. వైసీపీ నేతల తీరును, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామంటున్నారు.

Read More : Building Collapse : కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి

బిల్లులు పాస్‌ చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ప్రజాస్వామ్యంలోకి వెళతామంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. రెండు, మూడురోజుల్లో కార్యాచరణ రెడీ చేస్తామన్నారు మండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతు చేస్తామన్నారు.

Read More : Building Collapse : కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతి

శాసనసభలో అవమానాలను భరించలేకపోతున్నానని… మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానంటూ శపథం చేసి చంద్రబాబు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన నేరుగా టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. వెక్కివెక్కి ఏడ్చారు. దాదాపు రెండు నిమిషాల సేపు మాట్లాడలేకపోయారు. గత రెండున్నరేళ్లుగా తనను వ్యక్తిగతంగా వైసీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యకు రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆమెను కూడా చర్చల్లోకి లాగుతున్నారని చంద్రబాబు వాపోయారు. ఆమెకు తన గురించి తప్ప మరో ఆలోచన లేదని చెప్పారు. భువనేశ్వరి ఇల్లు దాటి ఎప్పుడూ బయటకు రాలేదని అన్నారు. ఏ సమస్య వచ్చినా, ఎలాంటి సంక్షోభం వచ్చినా ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. మరి ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వెళుతారు ? ఎక్కడి నుంచి ప్రారంభిస్తారనేది త్వరలో తెలియనుంది.